ఏపీలో 26జిల్లా సమాఖ్యలు.. DyCm బూడి
Ens Balu
7
Tadepalli
2022-05-19 15:09:50
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా జిల్లాలు ఏర్పడినందున 26 జిల్లా సమాఖ్యలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని తన చాంబర్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పంచాయతి రాజ్, గ్రామీణాభివ్రుద్దిశాఖ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, కొత్తగాల ఏర్పడిన 13 జిల్లాల్లో జిల్లా సమాఖ్యలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్ తో శతశాతం ఆడిట్ నిర్వహిస్తూ, జనరల్ బాడీ సమావేశాలు చక్కగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాల అభ్యున్నతి కి వీఏఓలు కీలకంగా వ్యవహిరించేలా చూడాలన్నారు. 30-50 గ్రూపులకు ఒక విఏఓ ఉండేలా చూడాలని హేతుబద్దంగా వారి నియామకాలు జరపాలన్నారు. ఇకపై మహిళలే వీఏఓలుగా ఉండాలని, దానికి సంబంధించి నిభంధనల మార్పు చేస్తూ వారి వయస్సు 18-45 వయస్సు ఉండేలా చేయాలన్నారు. అంతేకాకుండా స్థానికులకు, కాస్త చదువుకున్నవారికి మాత్రమే ఈ అవకాశాలు కల్పించాలన్నారు. మండల కమిటీ తో హెల్త్ సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ చేయించడంతోపాటు అక్రమంగా సర్టిఫికేట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. వికలాంగత్వ నిర్దారణ కోసం 6 నెలలకు ఒక సారి ప్రత్యెక సదరం క్యాంప్ ల ఏర్పాటు చేయాలని, ఆ సమాచారాన్ని అన్ని ప్రచార మాద్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.