ఇక గ్రామాల్లోనే పశువులకు వైద్యసేవలు..
Ens Balu
4
Tadepalli
2022-05-19 15:29:07
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పశువులకు అన్నిరకాల ఉచిత వైద్యసేవలు అందించడానికి సంచార పశు వైద్య అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల ఆంబులెన్స్ సేవలు గురువారం అమరావతిలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతలో రూ.143 కోట్ల వ్యయంతో రూపొందించిన 175 పశువుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పాడిరైతులకు ఈ సంచార పశువైద్య అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూశాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్య్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, పశుసంవర్ధశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.