ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కి సంబంధించి మూడు రోజుల్లోగా ఉద్యోగుల డిక్లరేషన్ ఫైల్స్ స్వీకరించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వాస్తవానికి గత అక్టోబర్ 2నాటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది. అనూహ్య పరిణామాల మధ్య వారి సర్వీసు ప్రొబేషన్ గడువుని 9నెలలు పెంచింది. 8నెలలు పూర్తవుతున్న తరుణంలో ‘వారి సర్వీస్ రెగ్యులైజేషన్ పై క్లారిటీ ఏది..?’ శీర్షికన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్, వెబ్ సైట్ Ens Live మరియు www.enslive.net ద్వారా ఏకకాలంలో సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులు, బాధలను ప్రత్యేక కధనంగా ప్రచురించింది. దీనితో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మేనెలాఖరు నాటికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రెగ్యులైజేషన్ ఫైళ్లను ఆయా శాఖలకు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఆదేశించింది. దీనితో రాష్ట్రంలోని 15005 సచివాలయాల్లోని సుమారు లక్షా 28వేల మంది ఉద్యోగులకు చెందిన ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లకు కదలిక వచ్చింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ గడువుని అమాంతంగా పెంచేసినా.. ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకున్న వారి విషయంలో మాత్రం నిభందనలు ఖచ్చితంగా అమలు చేసింది. పెంచేసిన గడువుతోపాటు, మహిళా ఉద్యోగులు తీసుకున్న ఆరు నెలల ప్రసూతి సెలవుల గడువు పూర్తయిన తరువాత మాత్రమే ఉద్యోగులకు చెందిన సర్వీస్ ప్రొబేషన్ ఫైళ్లను అధికారులు జాల్లా శాఖలకు చేరవేస్తున్నారు. దీనితో రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు వారు చేస్తున్న సచివాలయ ఉద్యోగాలను వదిలిపెట్టి పోయారు. అంతేకాకుండా విశాఖజిల్లాల్లో ఒక సచివాలయ ఉద్యోగి సర్వీసు రెగ్యులర్ కాకపోవడం, పని భారం అధికంగా ఉండటంతో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మేనెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రెగ్యులైజేషన్ ఫైళ్లు డిఎస్సీ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కు చేరితే అక్కడి నుంచి ఫైనాన్స్ శాఖకు వెళ్లి ఆపై ఏజీ నుంచి ఖజానాశాఖకు వీరి ఫైల్స్ చేరుకుంటాయి. ఈ తంతు అంతా జరగడానికి సుమారు నెలరోజులు సమయం పడుతుంది. దీనితో అన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ కి సంబంధించిన ఫైళ్లను పంపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వున్న 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆయా జిల్లాశాఖలను ఆదేశించడంతో గత 2 రోజులుగా ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లకు మోక్షం వచ్చంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూలై నెల నుంచి సర్వీస్ ప్రొబేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయి, వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేస్కేలు అందుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టుగా పీఆర్సీతో కూడిన పేస్కేలు ఇస్తుందా...లేదంటే హెచ్ఆర్ ఏలో కోతలు వేసిన పేస్కేలు ఇస్తుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి వుంది. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల విషయంలోగానీ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల విషయంలోగానీ వాటిని ప్రజలకు తెలియజేసేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్, వెబ్ సైట్ Ens Live మరియు www.enslive.net ద్వారా ఏకకాలంలో ప్రత్యేక కధనాలు ప్రచురిస్తూ వచ్చింది. అదే క్రమంలో ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో కూడా ప్రత్యేకంగా కథనం ప్రచురించడంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చి తమ సర్వీసు ప్రొబేషన్ ఫైళ్లకు మోక్షం కలిగిందంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విశాఖపట్నంలోని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ప్రధాన కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అయితే ఇపుడే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, వారి సమస్యలు, అక్కడక్కడా తేడా ఉద్యోగులు చేసే తప్పుడు పనులపైనా కూడా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ తన గళం బలంగా వినిపిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని జనరంజక కార్యక్రమాలను కూడా ప్రజల ముందుకు ప్రత్యేక వార్తా కధనాలుగా తీసుకు వస్తామని కూడా ప్రకటిస్తున్నాం. జనం గళంగా ప్రారంభమైన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎప్పుడూ జనం వెంట..జనం కోసం మాత్రమే పనిచేస్తుందని, ఈ విషయంలో ఏ రాజకీయపార్టీకి, నాయకులకు కొమ్ముకాసేది లేదని.. బల్లగుద్ది చెబుతున్నాం. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఈఎన్ఎస్ లైవ్.. అరచేతిలో విశ్వవార్తల సమాహారం..!