రైతుబజార్లలో కూరగాయలు సమ్రుద్దిగా ఉండాలి


Ens Balu
3
Tadepalli
2022-05-25 13:15:51

రాష్ట్రంలో వివిధ రైతు బజారుల్లో ప్రజలకు అవసరమైన వివిధ నిత్యావసర సరుకులు, కూరగాయలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో నిత్యావసర సరకుల ధరల స్థితిగతులపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రతిరోజూ నిత్యావసర సరకుల ధరలను మానిటర్ చేయాలని ధరల పెరుగుదల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.నిత్యావసర వస్తువుల ధరల మానిటర్ చేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేనున్నట్టు సిఎస్ పేర్కొంటూ దానిని అర్ధగణాంక విభాగం(డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్) అధికారులు రూపొందిస్తున్నట్టు సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.ఈయాప్ ను మార్కెటింగ్ శాఖ,పౌరసరఫరాల శాఖలు,తూనికలు కొలతలు శాఖ,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాలు వినియోగించుకుని నిరంతరం ధరలను పర్యేవేక్షించాల్సి ఉంటుందని సిఎస్ డా.సమీర్ శర్మ చెప్పారు.

        రైతు బజారుల్లో వివిధ కూరగాయలను కూడా పూర్తిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ రైతు బజారుల సిఇఓ మరియు మార్కెటింగ్ శాఖల అధికారులను సిఎస్ సమీర్ శర్మ ఆదేశించారు.ముఖ్యంగా ప్రస్తుతం టమాటా ధరలు అధికంగా ఉన్నందున మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతుల నుండి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజారుల్లో నిర్దేశిత ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

        ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇఓ కార్యదర్శి మరియు కమీషనర్ గిరిజా శంకర్,మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్,ఆయిల్ ఫెడ్   తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.అలాగే వీడియో లింక్ ద్వారా రాష్ట్ర సహకార మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మదుసూదన రెడ్డి,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్ బాగ్చి,ఇతర అధికారులు పాల్గొన్నారు.