YSRCP నుంచి అనంతబాబు సస్పెన్షన్


Ens Balu
2
Tadepalli
2022-05-25 13:56:51

ఎట్టకేలకు వైఎస్సార్సీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకుంది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీని పార్టీ నుంచి  స‌స్పెండ్ చేసింది. ఈ మేర‌కు  బుధ‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  ఆంధ్రప్రదేశ్ లో క‌ల‌క‌లం రేపిన  డ్రైవర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టైన అనంత‌బాబు ప్ర‌స్తుతం జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో  ఉన్నారు.  డ్రైవర్ ను తానే హత్య చేశానని తన తప్పుని ఒప్పుకోవడంతో వెంటనే శిక్షపడింది. వాస్తవానికి హత్యకేసులో అరెస్టు అయిన వెంటనే పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా..చాలా వరకూ తాత్సారం చేసింది. అయితే ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు, మీడియా పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లడంతో చేసేదేమీ లేక ఆఖరికి ఈ రోజు ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కేవలం పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది ఎమ్మెల్సీ పదవి విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి నేర చరిత్ర ఉన్నవారి విషయంలో పార్టీ అధిష్టానం గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం తో పార్టీతోపాటు, పదవి నుంచి కూడా తప్పిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ కేవలంల పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయంలో కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.