దావోస్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ అందరినీ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి బయలు దేరి వెళ్లారు.