ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాపోటీలు
Ens Balu
6
Tadepalli
2022-06-01 02:20:05
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా, ఆయుష్ విభాగము రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తుందని కమిషనర్ వి.రాములు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 21 జూన్ న జరిగే ఈ పోటీలకు 8 సంవత్సరాల పై బడి ఏ వయస్సు వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చుని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 1) పూర్ణ నటరాజాసన 2) దండియమన జాను సిరాసన 3) వటయానాసన 4) త్రివిక్రమాసన 5) విభక్త పశ్చిమోత్తానాసన 6) గర్భాసన 7) పద్మబకాసన 8) ఏకపాద విపరీత దండాసన 9) తీతిభాసన 10) వృశ్చికాసన 11) మయూరాసన 12) హనుమానాసన 13) పూర్ణ ఉష్ట్రాసన 14) పూర్ణ ఉష్టాసన పాదాంగుష్ట ధనురాసన 15) పూర్ణచక్రాసన 16) గండబేరుండాసనాలు వేయాలన్నారు. పేర్కొన్న 16 ఆసనాలలో ఏవైన 8 ఆసనాలను వేయగలిగినవారు ఆయా ఆసనాలను వేసి ఆసన స్థితిలో వున్న ఫోటోల ను advyoga2022@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపాల్సి వుంటుందన్ని పేర్కొన్నారు. ఫోటోతో పాటు తమ పేరు, వయస్సు, ఆధార్ నెంబర్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ లను పంపవలసి వుంటుందని, ఫోటోలు పంపుటకు చివరి తేది. 06గా నిర్ణయించినట్టు తెలియజేశారు. ఆరోజు సాయంత్రం 05గంటలలోపుగా వాటిని పంపాలని తెలియజేశారు. ఈ ఫోటోలను ప్రాధమికంగా పరిశీలించిన అనంతరం ఎంపిక ఐన వారు 10 జూన్ 2022 న న్యాయ నిర్ణేతల సమక్షంలో ఇవే ఆసనాలను ఆన్ లైన్ లో ప్రదర్శించవలసి వుంటుందని, ఇందులో ఎంపిక కాబడిన వారికి 21 జూన్ 2022న విజయవాడలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వటంతో, పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిధుల ద్వారా బహుమతులు అందజేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 9441014521లో సంప్రదించాలన్నారు.