జూన్ 12నుంచి14 వరకు జ్యేష్టాభిషేకం
Ens Balu
3
Tirumala
2022-06-07 12:45:58
తిరుమలలో జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు అభిద్యేయక జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.