శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్
Ens Balu
2
Tirumala
2022-06-08 10:34:51
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను గవర్నర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు, హరీంద్రనాథ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.