న్యూస్ ఏజెన్సీ వార్తకి మీడియా సంస్థలు డేట్ లైన్ ఎందుకివ్వాలి..
Ens Balu
4
Visakhapatnam
2022-06-23 13:40:55
ప్రపంచవ్యాప్తంగా మీడియా(ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్)కి ఎంత ప్రాధన్యత ఉన్నదో.. న్యూస్ ఏజెన్సీకి కూడా అంతకంటే రెండాకుల అధిక ప్రాధాన్యత ఉన్నది. ఒక్కో సందర్భంలో మీడియాకంటే న్యూస్ ఏజెన్సీ వార్త, ఆ వార్త సంస్థ డేట్ లైన్ తో వచ్చే ఫోటో, వీడియో, యానిమేషన్లకు మాత్రమే ప్రామాణికం వుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పటి మీడియాకి న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి..న్యూస్ ఏజెన్సీ అంటే ప్రింట్ మీడియానా..ఎలక్ట్రానిక్ మీడియానా..అసలు ఇలాంటిది అంటూ ఒకటి ఉందా, ఉంటుందా..వాళ్లేం చేస్తారు.. అని అడిగే ఈ తరం జర్నలిస్టు మహానుభావులు, అంతకు మించిన మీడియా సంస్థలు కూడా లేకపోలేదు. ప్రతీ మీడియా సంస్థకు ఒక న్యూస్ ఏజెన్సీ ఉండి తీరాలి అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ఆంక్ష. అయితే ఇటు మీడియాకి, అటు న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగించాలనే ఆర్ధిక ఇబ్బందులతో మీడియా సంస్థలు సొంత న్యూస్ ఏజెన్సీల నిర్వహణ మానేసాయి. కొన్ని సంస్థలు వార్త సంస్థలకు చందాదారులుగా చేరి వారిచ్చిన వార్తలను మీడియాలో ప్రచురించుకుంటున్నాయి. ఆ విషయం పెద్ద పత్రికలు, ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికలు, టీవీ ఛానళ్లకు మాత్రమే తెలుసు. కొన్ని చిన్న, మధ్య తరహా పత్రికలు, లోకల్ కేబుల్ టీవీలకు అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా తెలియదు. అలాగని న్యూస్ ఏజెన్సీ వార్తలు ఎందుకు వినియోగించాలో అసలే తెలియదు. కొందురు తెలిసినట్టు నటిస్తారు గానీ.. వారికీ అసలు విషయం తెలియదని వారికే తెలిసిన విషయం. ఇక తెలిసిన వారు వారి వారి మీడియా సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు న్యూస్ ఏజెన్సీ వార్త, ఫోటో, వీడియోలను, యానిమేషన్లను వినియోగిస్తూ(వారి మీడియా జర్నలిస్టులు కాకుండా గుర్తింపు పొందిన ప్రత్యేక వార్త సంస్థకు చెందిన జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, యానిమేటర్లు కవర్ చేసి ఇచ్చినవి) చందా దారులుగా వినియోగించుకుంటూ.. న్యూస్ ఏజెన్సీల డేట్ లైన్ వేస్తూ.. సదరు మీడియా సంస్థల గౌరవాన్ని నిలబెట్టుకుంటూ హుందాగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అయితే అక్కడి సమాచారశాఖ న్యూస్ ఆడిట్ చేస్తుంది(న్యూస్ ఆడిట్ అంటే ఒకే వార్త ఒకేసారి వివి పత్రికలు, టీవీ ఛానళ్లలో న్యూస్ ఏజెన్సీకి చెందిన స్క్రిప్ట్, విజువల్స్, లోగో, యానిమేషన్ తో వస్తే.. అది న్యూస్ ఏజెన్సీదనీ, లేదంటే అది సదరు పత్రిక సేకరించదని గుర్తిస్తారు. వాటిని ఆడిట్ చేసి ఆ రిపోర్టును మీడియా సంస్థలకు న్యూస్ ఏజెన్సీ స్క్రిప్టుతో సహా పంపుతారు) దౌర్భాగ్యం ఏంటంటే ఆ పరిస్థితి భారతదేశంలో లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అదేంటో కూడా తెలియదు. అందుకనే న్యూస్ ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యతగానీ, అవసరం గానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారశాఖ నిబంధనలు కానీ మన దేశ మీడియా సంస్థలు పాటించవు. నిజంగా భారతదేశంలోనూ, రాష్ట్రాల్లోని సమాచారశాఖ న్యూస్ ఆడిట్ చేపడితే మాత్రం న్యూస్ ఏజెన్సీల యొక్క ప్రాధాన్యత పెరిగి మళ్లీ పూర్తిస్థాయిలో పెరుగుతుంది. న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో సోషల్ మీడియా పుణ్యమాని ప్రతీ సామాన్యుడికీ తెలుస్తుంది. కానీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలకు, రాజకీయపార్టీలకు చెందిన నేతలకే ప్రధాన మీడియా సంస్థలు ఉండటంతో ఆ న్యూస్ ఆడిట్ అనేది జరగక న్యూస్ ఏజెన్సీల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. అసలు న్యూస్ ఏజెన్సీ యొక్క వార్త, ఫోటో, వీడియోను, యానిమేషన్లను మీడియా సంస్థలు ఎందుకు వాడాలనే మాటకొస్తే..సదరు మీడియా సంస్థలకు న్యూస్ వచ్చే ప్రదేశంలో సొంత జర్నలిస్టు లేని సమయంలో అక్కడ కవర్ చేసిన వార్తను ఏ న్యూస్ ఏజెన్సీ కవర్ చేసి మీడియా సంస్థలకు పంపితే.. ఆ ప్రామాణిక వార్తను మీడియా సంస్థలు ఆ యొక్క న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ తో ప్రచురించాలి..టీవీల్లో అయితే వాటర్ మార్క్ తో వేయాలి, లేదంటే న్యూస్ ఏజెన్సీ లోగోతో వేయాలి, డిజిటల్ మీడియా అయినా వాటర్ మార్క్ తోనే న్యూస్ వేయాలి. కానీ ప్రస్తుత మీడియా సంస్థలు సోషల్ మీడియాను మాత్రమే వేదిక చేసుకొని.. న్యూస్ ఏజెన్సీల కవర్ చేసి పంపిన వార్తలనైనా వారి సొంతవార్తలా వారి వారి డేట్ లైన్ తోనే వేసుకుంటున్నాయి. ప్రచురించేస్తున్నాయి. వాస్తవానికి న్యూస్ ఆడిట్ జరిగిన సమయంలో న్యూస్ ఏజెన్సీ కవర్ చేసిన వార్తను అదే వార్తగా ఏదైనా మీడియా సంస్థ కవర్ చేసినా, సదరు న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ వేయకపోయినా ఆ విషయాన్ని గుర్తించి వారికి నోటీసులు పంపాలి. అంతేకాకుండా సదరు వార్త సంస్థలు కాపీరైట్ దావా వేస్తే వారికి నష్ట పరిహారం కూడా కట్టాలి. ఆ ఇబ్బందులు రాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సమాచారశాఖలు మీడియా సంస్థలకు వార్త కవర్ చేసే ప్రాంతంలో జర్నలిస్టులు లేకపోతే.. అక్కడి నుంచి కవర్ చేసిన ఏ వార్తకైనా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ వేయాలని, లేదా సదరు జర్నలిస్టు రాయని వార్తకు జర్నలిస్టు డేట్ లైన్ వేయకుండా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ మాత్రమే వేయాలనే నిబంధన అమలు చేసింది. దానిని ఆర్ఎన్ఐ నిబంధనల్లోనూ పొందు పరిచింది. కానీ అవేవీ భారతదేశంలోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు జరగకపోవడంతో, అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా మీడియా సంస్థలకు తెలీకుండా పోయింది సరికదా..సదరు మీడియా సంస్థలు న్యూస్ ఏజెన్సీల వార్తలను, ఫోటోలను, వీడియోలను వార్త సంస్థ డేట్ లేన్ గానీ, లోగోగానీ, వాటర్ మార్క్ గానీ లేకుండానే వినియోగించేస్తున్నాయి. ఈ విషయం సమాచారశాఖ అధికారులకు తెలిసినా అది శూన్యమే అవుతుంది. దానికితోడు సోషల్ మీడియాపేరుతో మీడియా సంస్థలు కూడా తాము కవర్ చేసిన వార్త న్యూస్ ఏజెన్సీది కాదని, సోషల్ మీడియాదేనని చెప్పుకుంటూ న్యూస్ ఏజెన్సీల వార్తలను అప్పనంగా వాడేస్తున్నాయి. తమ వార్తగానే ప్రచురించేస్తున్నాయి. ఈరోజుకీ కొన్ని ప్రధాన ఇంగ్లీషు పత్రికలు, ఒకటి రెండు పెద్ద తెలుగు పత్రికలు, రెండు మూడు టీవీ ఛానళ్లు తప్పితే మిగిలిన ఏ మీడియా సంస్థలు కూడా తమది కాని వార్తకు తమ మీడియా సంస్థ డేట్ లైన్ వినియోగించడం లేదు. ఖచ్చితంగా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ మాత్రమే వేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు మాత్రం న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ ని పెట్టడం లేదు. సదరు వార్తను సేకరించినది న్యూస్ ఏజెన్సీయే అయినప్పటికీ ఆ వార్తను వారి యొక్క న్యూస్ స్టేటస్ కోసం వారి జర్నలిస్టులు కవర్ చేసినట్టుగానే అప్పనంగా వాడేసుకుంటున్నాయి.. ఆర్ఎన్ఐ నిబంధనలను మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. న్యూస్ ఆడిట్ అసలు జరగడంలేదు.. అంతెందుకు జర్నలిస్టులు లేని ప్రదేశాల నుంచి కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు ప్రచురితం అయినా ఆ విషయాన్ని సమాచారశాఖ మీడియా సంస్థలను ప్రశ్నించడంలేదు. కనీసం సంస్థలో పనిచేసే పనిచేసే జర్నలిస్టుల సమాచారం కూడా తీసుకోవడం లేదు. అలా తీసుకున్న రోజు.. ఒకే వార్త అన్ని పత్రికల్లో న్యూస్ ఏజెన్సీకి చెందిన న్యూస్ వెబ్ సైట్, న్యూస్ యాప్, న్యూస్ వైర్ లను పోలి ఒకే విధంగా వచ్చిన రోజు.. అది న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన వార్తమాత్రమేనని తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సమాచారశాఖలు మీడియా సంస్థలు వార్తల విషయంలోనూ, న్యూస్ ఏజెన్సీల వార్తలను, వాటికి చెందిన డేట్ లైన్ ను వినియోగించే విషయంలో నిర్ధిష్ట ఆదేశాలను అమలు చేసిన రోజు ఏది మీడియా సేకరించిన వార్తో..ఏది న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన వార్తో..ఏది సోషల్ మీడియా నుంచి తస్కరించి వార్తో ప్రభుత్వాలకు తెలుస్తుంది. అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏంటో అటు మీడియాకి, ప్రభుత్వాలకు, పాఠకులకు తెలుస్తుంది..!