సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మి ప్రభుత్వ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యపై రూ.52,677 కోట్లు వెచ్చించిందని గుర్తుచేసారు. జగనన్న అమ్మ ఒడి పథకం క్రింద 44,48,865 మంది లబ్ధిదారులకు రూ.19617.53 కోట్లు అందించారని అన్నారు. జగనన్న విద్యాదీవెన క్రింద 21,55,298 మందికి, జగనన్న వసతి దీవెన పథకంలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం 18,77,863 మందికి మొత్తం రూ 11007.17 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా రాష్ట్రంలో 47,40,421 మంది లబ్ధిదారులకు రూ 2368.33 కోట్లు అందించిందని,జగనన్న గోరుముద్దలు క్రింద 43,26,782 మందికి రూ 3087..50 కోట్లు అందించిందని అన్నారు. పాఠశాలల్లో నాడు నేడు పథకం క్రింద 15715 స్కూల్లు ఆధునికీకరణకు మొదటిదశలో రూ.3669 కోట్లు వెచ్చించిందని అన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ క్రింద 3419875 మంది లబ్ధిదారులకు రూ.4895.45 కోట్లు అందించిందని అన్నారు. స్వేచ్ఛ పథకం క్రింద 10,01,860 మంది లబ్ధిదారులకు రూ.32కోట్లు వెచ్చించి శానిటరీ న్యాప్ కిన్స్ అందించిందని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడైనా మీటింగ్ అయిపోయాక జనం కుర్చీలపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోతారని కేవలం చంద్రబాబు మీటింగ్ లోనే కుర్చీలు ఎత్తుకెళ్తారని ఏద్దేవా చేసారు.వైఎస్ఆర్ సిపి ప్లీనరీ ప్రారంభానికి ముందు సమావేశం అనంతరం ఖాళీగా ఉన్న కుర్చీలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్న పచ్చమీడియాపై ఆయన మండిపడ్డారు. ఇటువంటి చౌకబారు ప్రచారంతో ప్రజలలో విశ్వాసం పూర్తిగా కోల్పోయారని అన్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ని పట్టుకుని కోవిడ్ అని సంబోధించిన చంద్రబాబునాయుడికి ఇటివల పెట్టుకున్న చిప్ కూడా అరికాలును దాటి పాతాళానికి పడిపోయినట్టుందని ఎద్దేవా చేసారు. సీఎం అయ్యాకే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని మంగమ్మ శపధం చేసిన చంద్రబాబు, రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు ఓటు వేయాలంటే అసెంబ్లీకి వెల్లాల్సివస్తుందని మర్చిపోయినట్లున్నాడని అన్నారు.
క్షుద్రపూజలు చేసి చంద్రబాబు, లోకేష్ లు వక్రబుద్ది వరంగా పొందారని ఫలితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి వీరికి వంకరగానే కనిపిస్తున్నాయని అన్నారు. అరాచకపాలక, అసురపాలన అంటే చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు రాక్షసపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆ దుష్టపాలనకు చమరగీతం పాడి, రాజన్నరాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని అన్నారు. అరాచకపాలనంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.