ఆంధ్రప్రదేశ్ లో కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు పొందిన వారంతా తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒక శాఖలో తమకు నాల్గవ తరగతి కింది ఉద్యోగాలిచ్చినా బాగుండు..అది పోయి గ్రామ,వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాలిచ్చారు..అక్కడ కేవలం రూ.15వేలకే రెండేళ్ల పాటు ప్రొబేషన్ చేయాలి.. ఆ ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.. ఎటూచాలని జీతంతో కుటుంబాలను నెట్టుకొచ్చేది ఎలా అంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం సచివాలయ శాఖలో లక్షా 21వేల ఉద్యోగాలు రెండు నోటిఫికేషన్ల ద్వారా భర్తీచేసింది. ఆ తరువాత మిగులు ఉద్యోగాలను కారుణ్య నియామకాల క్రింద మళ్లీ సచివాలయ శాఖలోనే భర్తీచేస్తోంది. ఇప్పటికే సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ పూర్తికావడానికి రెండు సంత్సరాల 9నెలల సమయం పట్టింది. ఇపుడు మా పరిస్థితి కూడా అలానే వుంటుందనుకొని బెంగ పెట్టుకుంటున్నారు ఉద్యోగులు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ..సర్వీసులో చనిపోతే నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగాలను పిల్లలకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అయితే ఉద్యోగం వచ్చినందుకు ఆనందించాలో.. ప్రొబేషన్ లేట్ అయిపోయే సచివాలయశాఖలో వచ్చినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగుల్లో. ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖలో విధులు నిర్వహిస్తూ మ్రుతిచెందినా ఉద్యోగుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే వారి విద్యార్హతలను బట్టీ నియమిస్తుంది. ఇక్కడైతే ఉద్యోగులు రెండేళ్ల వరకూ రూ.15వేలకే ఉద్యోగాలు చేయాల్సి వుంటుంది(పెరిగిన పీఆర్సీప్రకారం జీతం ఇస్తారో అనే విషయంలో క్లారిటీ లేదు) . అదే ఇతర ప్రభుత్వ శాఖల్లో అయితే ప్రభుత్వం నిర్ధేశించిన పేస్కేలు అమలు చేస్తారు. దీనితో ఇపుడు సచివాలయ శాఖలో ఉద్యోగం అంటే కారుణ్య నియామక ఉద్యోగార్ధులు హడలి పోతున్నారు.
ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ చాలా ఉద్యోగాలను భర్తీచేస్తారని అందరూ అనుకున్నారు. అక్కడ భర్తీచేయాల్సిన సుమారు 850కి పైగా ఉద్యోగాలను కూడా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే బర్తీచేయాలని రాష్ట్ర జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ శాఖలో భర్తీకాకుండా మిగిలిపోయిన ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం సచివాలయ శాఖలో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హబ్జండరీ, మహిళా పోలీస్ శాఖల్లో అధికంగా ఖాళీలు ఉన్నాయి. ఇక పంచాయతీ కార్యదర్శిలు ఇతర శాఖలకు చెందిన పోస్టులు మాత్రం తక్కువగానే ఉన్నాయి. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల జాబితా వచ్చిన తరువాత కారుణ్య నియామకాలు చేపట్టాలనుకునే కుటుంబాల పిల్లల నుంచి విద్యార్హతలను సేకరించి వారిని సదరు ఉద్యోగాల్లో భర్తీచేయనుంది ప్రభుత్వం. అయితే ఇతర శాఖల్లో అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా అయినా వెళ్లడానికి ఇష్ట్ పడుతున్నారు తప్పితే ఏ కేటగిరీకి చెందిన ఉద్యోగమో నేటికీ తెలియని గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగాల్లో జాయిన్ కావడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. ప్రభుత్వం మాత్రం మిగులు ఉద్యోగాలన్నీ కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయడం ద్వారా సచివాలయ శాఖలో అన్ని మిగులు ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తుంది. తద్వారా సచివాలయ శాఖలో అన్ని ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయనే ఆలోచనలో వున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఆగస్టు 1 నుంచి పెరిగిన పేస్కేలు ప్రకారం పేస్కేలు ఇవ్వాలని జీఓ నెంబరు-5ని విడుదల చేసినా.. కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాల్లో చేరే వారికి పెరిగిన పేస్కేలు వర్తిస్తుందా లేదా అనే విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడమే కొత్తగా ఉద్యోగాల్లోకి చేరేవారు సచివాలయ శాఖకు రావడానికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చినా..ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలతో కుటుంబాలను నెట్టుకు రావడం చాలా కష్టం అవుతుంది. అందులోనూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఖాళీలు ఉంటే ఆ జిల్లాల్లో వారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక జిల్లాలో ఖాళీలు లేకపోతేమాత్రం పక్కజిల్లాకు పంపే అవకాశాలూ కూడా లేకపోలేదు. అదే జరిగితే ఉద్యోగార్ధులపై ఆర్ధిక భారం మరింత ఎక్కువగా పడుతుంది. వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకొని కారుణ్య నియామకాలన్నీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మిగులు ఉద్యోగాలన్నీ ప్రభుత్వం భర్తీచేయాలన్నా ఎవరూ ముందుకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తరువాత చాలా ప్రభుత్వ శాఖలకు జూనియర్ అసిస్టెంట్లు కూడా అవసం వుంది. అయితే దానికి ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వాటిని భర్తీచేస్తే..చచ్చినట్టు ఉద్యోగార్ధులంతా సచివాలయ శాఖలో ప్రభుత్వం చూపించిన విధంగా విధుల్లోకి చేరాల్సి వుంటుంది. చూడాలి ప్రభుత్వం కారుణ్య నియామకాల విషయంలో ఏ విధమైన విధి విధానాలను అవలంభించి మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తుందనేది..!