ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష్ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు ఎక్కడి వస్తే అక్కడ ఫ్లెక్సీ..పుట్టినరోజుకి ఫ్లెక్సీ..ఎవరైనా చనిపోతే ఫ్లెక్సీ..సినిమా ప్రచారాలు..ప్రముఖల పర్యటనలు ఇలా దేనికైనా ప్లాక్టిక్ ఫ్లెక్సీలే..ఇవన్నీ ఆగస్టు 26 వరకూ మాత్రమే.. ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖలో ప్లాస్లిక్ ఫ్లెక్సీలపై నిషేధం ప్రకటించిన తరువాత ఒక్కసారిగా ఫ్లెక్సీలు, ప్రింటర్లు అంతా కుప్పకూలిపోయాయి. ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు వేయకూడదని..వాటిపై నిషేదం ప్రకటిస్తున్నామని చెప్పిన ప్రకటన అన్ని వర్గాలు, వ్యారస్తులు, కంపెనీలు, సినిమా పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేటివరకూ కిరాణా షాపుల్లో నేటికీ ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రభుత్వం హెచ్చరికలు చేసినా నియంత్రించలేకపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లలోనే మంచినీరు.. కూల్ డ్రింకులు..ఆఖరికి షాపింగ్ మాల్ లో సామాన్లు తెచ్చుకోవడానికి కూడా ప్లాస్టిక్ కవర్లు మాత్రమే వినియోగిస్తున్నారు. వీటిపై నిషేదం వున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ఈ తరుణంలో సీఎం చేసిన ప్రకటన ఒక్కసారిగా వ్యాపార వర్గాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. వాస్తవానికి ప్లాస్టిక్ నియంత్రణ మానవాళి మనుగడకు శాపంగా మారిన తరుణంలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగా అవి ఎక్కడా అమలు కావడం లేదు. అలాంటిది ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ ప్రకటించగానే అవి ప్రింటింగ్ చేసే ప్రింటర్లు, పరిశ్రమల వారంతా లబో దిబో మంటున్నారు.
ప్రింటర్ల మనుగడ ప్రశ్నార్ధకం
ఇప్పుడిప్పుడే మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఫ్లెక్సీ ప్రింటర్లు ఏర్పాటు చాలా జోరుగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇపుడు ప్రతీ చిన్నకార్యక్రమానికి ఫ్లెక్సీలు ప్రింట్ చేయించడం అలవాటు చేసుకున్న సమయంలో ఒకేసారి దానిని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించడం ఒకింత ప్రజాప్రనిధులకు కూడా మింగుడు పడటం లేదు. ఇకపై ఏ గ్రామానికి వెళ్లినా రంగు రంగుల ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిదారి కనిపించాయా..వారి చుట్టూ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకునే పరిస్థితిలు ఇపుడు అధికంగా ఉన్నాయి. అలాగని గుడ్డపై ప్రింటింగ్ వేయిస్తే ప్లాస్టిక్ ఫ్లెక్సీ కంటే రెండింతలు రేటు అధికం అవుతుంది. రేటు పోయినా..ఫ్లెక్సీలో కనిపించినంతగా గుడ్డపై ప్రింటింగ్ కనిపించదు ప్రజలను ఆకట్టుకోదు. ఈ తరుణంలో ప్రింటర్లు, వారికి అత్యధికంగా వ్యాపారాలు ఇచ్చే ప్రజాప్రతినిధులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఫలింతంతా ఫ్లెక్సీ ప్రింటర్ల మనుగడ ప్రశ్నార్ధకం కానుంది. సీఎం ప్రకటనలో ఉన్న ప్రింటర్లంతా వాటిని బేరం పెట్టే పనిలో పడతారనే ప్రచారం కూడా అపుడే ప్రారంభమైంది.
ప్రభుత్వ కార్యాలయాల్లోనే అత్యధిక వినియోగం
ప్రభుత్వం ప్లాస్టిక్ పై బ్యాన్ ప్రకటించడం శుభ పరిణామమే అయినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వినియోగం అధికంగా జరుగుతుంది. ప్రజలకు అవసరయ్యే విధంగా ఏర్పాటు చేసే బోర్డులు కూడా ప్రభుత్వశాఖల్లోనే అధికంగా ప్రింట్ చేయిస్తుంటారు. ప్రతీ కార్యాలయం ముందు, కార్యాలయం లోపల కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తిచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, ఇతర మండల కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా బోర్డులన్నీ ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. ప్రజాప్రతినిధులు ఎంత ఎక్కువగా ఫ్లెక్సీలు వినియోగిస్తారో..దానికి వందరెట్లు రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరుగుతుంది. ఈనేపథ్యంలో సీఎం చేసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తో అందరి గొంతులోనూ పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యాలయాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. వాటిని సీఎం ప్రకటన నేపథ్యంలో తొలగిస్తారా అంటే ఏ ఒక్క అధికారి దగ్గర నుంచీ సరైన సమాధానం ఇంకా వెలువడలేదు.
ప్లాస్టిక్ కవర్లనే నియంత్రించలేకపోయారు..?
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్నే పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోయింది. ఈ తరుణంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తే అలమలు జరుగుతుందా అంటే ఖచ్చితంగా అమలు జరగదని..ప్లాస్టిక్ ఫ్లెక్సీల వరకూ అనుమతులు మళ్లీ అత్యధిక మంది అభ్యర్ధనతో తిరిగి అనుమతిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చేసిన ప్రకటనకు, సింగిల్ యూజ్ ప్లిస్టిక్ నియంణత్రకు తీసుకున్న కఠిన నిర్ణయాలు గాలికి ఎగిరిపోయినట్టే అవుతుందనే వాదన కూడా మరో వైపు బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రముఖ కంపెనీలు సీతల పానియాలు, మంచినీరు, ఇతర ఉత్పత్తులన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిళ్లలోనే పెట్టి వ్యాపారాలు చేస్తున్నాయి. వాటిపై నాటి నుంచి నేటి వరకూ ఎక్కడా నిషేధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గ్లాసులు వ్యర్ధాలనే పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. అలాగని అవి తయారు చేసే సంస్థలపై చర్యలు తీసుకుంటారా అంటే ఆ ఒక్కటీ ప్రభుత్వం చేయడం లేదు. ప్లాస్టిక్ వినియోగించేవారిపైనా.. చిన్న చిన్న వ్యాపార సంస్థలపైనా కేసులు నమోదు చేస్తున్నది. ఇలాంటి తరుణంలో సీఎం చేసిన చేసిన ప్లాక్ ఫ్లెక్సీలు రద్దు ప్రకటన ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఎంచేసిన ప్రకటనతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా నేటి వరకూ ఏ ఒక్కరూ తమ తమ కార్యాలయాలతోపాటు పార్టీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీలను మాత్రం తొలగించకపోవడం విశేషం.
సీఎం ప్రకటన ఆచరిస్తే గ్రీన్ ఏపీగా రూపాంతరం
ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, కవర్లు, గ్లాసులు, బాటిళ్లు ఇతర సింగిల్ యూజ్ ప్లాస్లిక్ ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించగలిగితే రాష్ట్రం గ్రీన్ ఏపీగా అవతిరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలా జరగాలంగే చాలా అడ్డంకులను ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులను చేస్తే తప్పా అది సాధ్యం కాదు. అన్నింటికంటే ముందుగా ప్లాస్టిక్ బాటిళ్లు తయారు చేసే సంస్థలను ప్రభుత్వం పనిగట్టుకొని నియంత్రించాల్సి వుంటుంది. అయితే అది జరిగే వీలు లేదు సరిగా ఆ పనిగా మాత్రం కార్య రూపంలో కనిపించడం లేదు. భూమిని తినేస్తున్న ప్లాస్టిక్ బూతాన్ని తరిమికొట్టాలంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగంపై బ్యాన్ విధించాల్సి వుంటుంది. అలా జరిగిన క్రమంలో కొంత మేరక వినియోగం నేరుగా తగ్గే పరిస్థికి వస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో ప్రకటించిన ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందనని విశ్లేషకులు రక రకాల అంచాలు వేస్తున్నారు. చూడాలి ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ స్టేట్ గా మార్చాలనుకున్న సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కల ఏ మేరకు సాకారం అవుతుందనేది.. కాకపోతే ఖచ్చితంగా అవ్వాలనే ప్రతీ ఒక్కరం కోరుకుని.. ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..లేదంటే ఇదే ప్లాస్టిక్ భూమితోపాటు జీవకోటి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుంది..!