శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకి ఆహ్వానం


Ens Balu
19
Tadepalli
2022-09-21 09:29:30

కలియుగ వైకుంఠం తిరుమలలోని  ఈ నెల 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల‌ని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి టిటిడి ఆహ్వానం అందించింది. ఈ మేరకు బుధవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి  ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. వెల‌గ‌పూడి సచివా‌లయంలోని ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్‌లో సీఎంను క‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల వివరాలను తెలియజేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు. 

        బ్ర‌హ్మోత్సవాల తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.