తిరుమల బ్రహ్మోత్సవాలకు స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వ హణాధికారి ఏ.వీ ధర్మారెడ్డి ఆహ్వాన పత్రికను అందచేసారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వీరు స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను బహుకరించి బ్రహ్మోత్సవాల విశిష్టతను గురించి వివరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, సతీసమేతంగా ఈ అధ్యాత్మిక వేడుకకు హాజరై స్వామివారి ఆశ్సీస్సులు అందుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.