తిరుమలలోని అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న నూతన పరకామణి భవనాన్ని టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి గురువారం సాయంత్రం సివిఎస్‌వో నరసింహకిషోర్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ భవనాన్ని సెప్టెంబరు 28న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తరువాత శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో రూ.4 కోట్లతో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఈవో పరిశీలించారు. ఇక్కడి భోజనశాలలో దాదాపు 150 మంది భోజనం చేసేలా అభివృద్ధి చేస్తున్నారు. ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఇఇలు జగన్మోహన్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, డిఇ రవిశంకర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు వెంకటయ్య, సెల్వం, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.