శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగళవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా  ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
           ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి  నారాయణ స్వామి, మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  సత్యనారాయణ,  వేణుగోపాలకృష్ణ,  రోజా, ఎంపిలు  మిథున్ రెడ్డి,  రెడ్డెప్ప, తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకరరెడ్డి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, జెఈవో  వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.