ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర1న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదేరోజు నుంచి ఓటర్లు కూడా తమ ఓటును నమోదు చేసుకోవాల్సి వుంటుంది. గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మాత్రమే వుంటుంది. ఓటు నమోదు చేసుకోవడానికి అభ్యర్ధులు ఫారమ్ 18ని నింపి దానికి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్) ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జతచేయాల్సి వుంటుంది. అలా పూర్తిచేసిన దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయం, లేదా ఆర్డీఓ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ లలో సమర్పించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లై లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో ఓటర్లుగా ఉన్నవారు కూడా మళ్లీ ఓటు నమోదు చేసుకోవాలి.
పాత ఓటరు జాబితా మొత్తం రద్దు చేయడం వలన ఇపుడు అభ్యర్ధులంతా కొత్తగా నోమోదు చేసుకోవాలి. పెద్దల సభకు తమ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను పంపాలనుకునే పట్టభద్రులు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవడంతోపాటు, ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ ఒక్క పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవడంతోపాటు, తోటి పట్టభద్రులతో కూడా ఓటుని నమోదు చేసుకునేలా తమవంతు సహకారం అందించాలని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రతీ పట్టభద్రుడుకి సూచిస్తోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు ఓటింగ్ శాతం పెరగడానికి ప్రతీ ఒక్కరూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలని కూడా కోరుతున్నాం.