అనంతపురంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం వైయస్.జగన్మోహనరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో కురుస్తున్న వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వివరించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సీఎం ఆరా తీశారు. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
అదే సమయంలో హఠాత్తుగా కుండపోత, ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి వివరాలను కూడా సీఎం ద్రుష్టికి అధికారులు తీసుకొచ్చారు. వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు బియ్యం, పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలన్నారు.
వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేసి నిర్ణీత సమయంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు..