శ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో ఈనెల 25వ సూర్యగ్రహణం సందర్భంగా స్వామవారి దర్శనాలు ఉదయం 4 గంటల నుంచి 8గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారని దేవస్థానం అధికారులు ఒక ప్రకనటలో తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి ఆలయం మూసివేసి 26వ తేదిన ఉదయం తెల్లవారుజామున తెరుస్తారని పేర్కొన్నారు. స్వామివారి వ్రతముల టికెట్లు ఉ "08.00 గంటల వరకు మాత్రమే ఇస్తారని.. వివిధ సేవలు, హోమములు ఉ"07.00 గంటలకు ప్రారంభించి 10.30 ని.లకు ముగించిన తరువాత ఆలయం మూతవేస్తారని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.