భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించాలనే ఉన్నత లక్ష్యంతో మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు ఉద్యోగుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసి ఈశాఖలో ప్రత్వం దాని పరిపాలన బాధత్యలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయిలో కట్టబెట్టకపోవడం, నిర్ధిష్ట ప్రణాళికతో వ్యవహరించడకపోవడంతో అనుకున్న లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. అధికారుల మొండి వైఖరి, గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సిబ్బందిపై తీసుకొస్తున్న ఒత్తిడి కారణంగా ఉద్యోగులు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఒకే ఏడాది విశాఖజిల్లాలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, కాకినాడ జిల్లాలో హార్టికల్చర్ అసిస్టెంట్ సుభాష్ చంద్రవర్మ, కేవలం అధికారుల పని ఒత్తిడి కారణంగానే బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగాఉందో అర్ధంచేసుకోవచ్చు. ఒక విధివిధానం, ముందుచూపు, వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవరిస్తున్న అధికారుల తీరు ఉద్యోగుల ప్రాణాలను హరిస్తున్నాయి.
ఈ-కేవైసీకి ముందుకి రాని బడా రైతులు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతుల భూముల వివరాలు, పంటల వివరాలు తెలుసుకోవడంతోపాటు వారికి పంటలు వేసిన సమయంలో ప్రక్రుతి వైపరీత్యాలు వచ్చిన నష్టానికి సహాయం అందించేందుకు గ్రామ సచివాలయాల్లోని హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ఆయా ఆర్బీకేల్లో నమోదు చేస్తున్న ఈ-కేవైసీ చేయించుకోవడానికి బడా రైతులు ముందుకి రావడం లేదు. తమకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంగానీ, ఎలాంటి సహాయం వద్దని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. పంటలు నమోదు చేసుకోవడానికి చిన్నా, చితకా రైతులు తప్పా మరెవరూ ఆశక్తి చూపించడం లేదు. పైగా ఈ-కేవైసీ ఎందుకు చేయించుకోవాలనే విషయంపై రైతులకు ముందుగా అవగాహన లేకపోవడం కూడా ఈ పరిస్థితి కారణం అవుతోంది. జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రభుత్వం ఈ-కేవైసీ ఎందుకు ప్రవేశపెట్టిందనే విషయాన్ని ముందుగా రైతులకు తెలియజేస్తే దానిపై అవగాహన పెంచుకొని, వివరాల నమోదుకి ముందుకి వస్తారు. కానీ ఆపనిని అరకొరగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు.
గ్రామస్థాయిలో పరిస్థితి పట్టని జిల్లాఅధికారులు
గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వున్న ఆర్బీకేల ద్వారా ఈ-కేవైసీ, వివరాల నమోదు బాధ్యతను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారులు అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లకు టార్గెట్లు విధిస్తున్నారు. తీరా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ముందుకి రావకపోవడంతో గ్రామస్థాయిలో సిబ్బంది ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటున్నది. ఆ విషయాన్ని మండల, జిల్లా అధికారులతోపాటు కలెక్టర్, జెసిలకు చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. తాము చెప్పిన పనిచేయాల్సిందేనంటూ తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. కొంత మంది మొండిగా పని చేయిస్తున్నా..మరికొంత మందికి ఈ ఒత్తిడి మానసి శిక్షగా పరిణమిస్తోంది. గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితి పలానా విధంగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోకపోతే తాము ఇంకెవరికి చెప్పాలంటూ గ్రామ సచివాలయశాఖలో పనిచేసే ఆర్టికల్చర్, అగ్రికల్చర్, సెరీకల్చర్ అసిస్టెంట్లు నెత్తీ నోరూ కొట్టుకుంటూ లబోదిబో మంటున్నారు. ఈ తరుణంలోనే అధికారు ఒత్తిడి తట్టుకోలేక హార్టికల్చర్ అసిస్టెంట్ వర్మ గోదావరినదిలోకి దూకి బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది.
బెదిరింపులు, ఒత్తిడి తోనే ఉద్యోగులతో విధులు
గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందితో జిల్లా అధికారులు తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు చేస్తూనే ఉద్యోగాలు చేయిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన తరువాత శాఖల వారీగా జిల్లా అధికారులు సచివాలయాల్లో సిబ్బంది పనిచేసే విధి నిర్వహణను తనిఖీలు చేస్తున్నారు గానీ, టూర్ డైరీలు, డ్యూటీ రిజిస్టర్లు, ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్న విషయాన్ని గానీ పట్టించుకున్నది లేదు. కానీ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలొస్తే మాత్రం ఆ పనిభారాన్ని సచివాలయ సిబ్బందిపై నేరుగా రుద్దేస్తున్నారు. సచివాలయశాఖలో కూడా కొన్నిశాఖల సిబ్బందికి నేటికీపూర్తిస్థాయిలో పనిలేదు. కొంత మంది ఉన్నా వారంతా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. మరికొందరు పనిచేస్తున్నా అలాంటి వారిపైనే అధికారులు కూడా పనిభారాన్ని తీవ్రంగా మోపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జెసిలు, జిల్లా అధికారులు, మండల స్థాయిలో మండల అధికారులు ఆఖరికి సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిలు సైతం ఒకే విధంగా ఉద్యోగులపై తీవ్రస్థాయిలో బెదిరింపులు, ఒత్తిడి తీసుకు వచ్చి మాత్రమే పనిచేయిస్తున్నారు. మరికొంత మంది అధికారులు ఒక అడుగు ముందుకేసి పులిహోర కలిపి వారి, అవసరాలు తీర్చుకునే పనులు కూడా చేపట్టారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ప్రభుత్వశాఖల అధికారుల్లో కొరవడిన సమన్వయం
గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత సదరుశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా శాఖల అధికారుల్లో సమన్వయం పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. సచివాలయ శాఖలో ఉన్న 19శాఖలకు సంబంధించిన ఆయాశాఖల ముఖ్యల కార్యదర్శిలు, కమిషనర్లు ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు ప్రాపర్ ఛానల్ లో మండల అధికారులకు పంపడం లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయంల నుంచి ఉత్తర్వులు రాకపోయినా..సచివాలయ సిబ్బంది సదరు ప్రభుత్వశాఖ ద్వారా జారీ అయిన ఉత్తర్వులను సేకరించి ఈ విషయాన్ని మండల అధికారులకు తెలియజేసినా..చూపించినా అవి బుట్టదాఖలు అవుతున్నాయి. తమకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేస్తే తప్పా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వచ్చినా వాటిని అమలు చేసేది లేదంటే వాటిని ఏమీకాకుండా పక్కన పడేస్తున్నారు. పైగా సచివాలయంలోని ఎవరిశాఖల ఉద్యోగాలు, వారి శాఖల విధులు చేసుకోనీయకుండా మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు తీవ్ర ఒత్తిడిలు తీసుకొస్తున్నారు.
ఒక్కముక్కలో చెప్పాలంటే మండల శాఖ అధికారులే సచివాలయశాఖ రాష్ట్ర ముఖ్యకార్యదర్శిలుగా వ్యవహరించడం విశేషం. ఒక్క విధి నిర్వహణలోనే కాకుండా పర్మిషన్లు, సెలవులు, సభలు సమావేశాలకు వెళ్లాలన్నా కూడా మండల అధికారుల అనుమతి కావాలని ఆదేశించి వాటిని కార్యదర్శిల ద్వారా అమలు చేయడం కూడా సచివాలయ సిబ్బంది విధి నిర్వహణకు, పనిఒత్తిడికి కారణం అవుతోంది. కేవలం జిల్లా కలెక్టర్ నుంచి మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిల వరకూ పరిపాలన విషయంలో సమన్వయం లేకపోవడమే ఉద్యోగులపై ఒత్తిడికి కారణం గా కనిపిస్తున్నది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై ఆ తరువాత మరో ఉద్యోగం చూసుకొని వెళ్లిపోతున్న ఉద్యోగల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మరికొందరు ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలకు రిజైన్ చేసి కూడా వెళ్లిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నా జిల్లా అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో పనిఒత్తిడి అధికమై సచివాలయ సిబ్బంది బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ద్రుష్టిసారించకపోతే ప్రజలకు సేవలందించే సచివాలయ ఉద్యోగుల పడుతున్న తీవ్రమైన ఒత్తిడి, అధికారుల మొండి వైఖరి, వ్యహార తీరుపై వ్యతిరేకత, నిరసన అధికమై ప్రభుత్వానికి మచ్చ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!