సమర్ధవంతంగా విధి నిర్వహణ చేయాలి


Ens Balu
22
Tadepalli
2022-10-18 07:06:54

విధి నిర్వహణలో ఎక్కడా రాజీలేకుండా సమర్ధవంతంగా పనిచేయాలని శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్ లకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సూచించారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ మార్గనిర్ధేశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అనేవిధంగా పనిచేసి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసిన ఐపీఎస్ లలో  ధీరజ్‌ కునుబిల్లి, జగదీష్‌ అడహళ్ళి, సునీల్‌ షెరాన్, రాహుల్‌ మీనా లు ఉన్నారు.