ఇక పిల్లల సంరక్షణ సెలవులు 180 రోజులు


Ens Balu
29
Tadepalli
2022-10-19 08:04:49

ఆంధ్రప్రదేశ్ లోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సమయం దాటిని తరువాత ఇచ్చే పిల్లల సంరక్షణ సెలవుల విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సెలవులు కేవలం 60 రోజులు మాత్రమే ఉండేవి. అయితే వాటిని ప్రభుత్వం పిల్లల సంరక్షరార్ధం 180 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవులను మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవుల తరువాత పది విడతలుగా వీటిని వినియోగించుకునే అవకాశం వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తరువాత వారి పిల్లల సంరక్షణలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ఎవరైనా ఉద్యోగులు సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఈ సెలవులను వినియోగించుకంటే మాత్రం వారి సర్వీస్ రెగ్యులైజేషన్ గడువు పెరుగనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులైజేషన్ సమయంలో ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి గడుపు తీరిన తరువాత వారి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంతో దీనిని అమలు చేశారు.