ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్లు చేసే అతిపెద్ద తప్పు..!


Ens Balu
93
Tadepalli
2022-10-21 01:50:37

ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు చేసే పరిపాలనకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ముఖ్యమైన పరిపాలనలో అందించే అధికారులే తప్పుచేస్తే.. ప్రజా పరిపాలన 75 ప్రభుత్వశాఖలను ఏ విధంగా సమన్వయం చేస్తారు..? ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయా..? ఏంటి నేరుగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్లు పడ్డాయని అనుకుంటున్నారా.. ఈ వార్త, తరువాత రాబోయే దారావాహికంలో ఇంకెలాంటి వార్తలు రాబోతున్నాయని అనుకుంటున్నారా..మీరు అనుకున్నది నిజమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సివిల్ సర్వీస్ అధికారులు(ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్) ఇలా అందరు అధికారులు చేస్తున్న చిన్న చిన్న తప్పులు, చూసీ చూడనట్టు వదిలేస్తున్న విషయాల కారణంగా జరగాల్సిన అభివ్రుద్ధి, పరిష్కారానికి నోచుకోవాల్సిన సమస్యలు, ప్రజలకు దగ్గర కావాల్సిన ప్రభుత్వ సేవలు ఎక్కడివి అక్కడే ఉండిపోతున్నాయి. 

వాటిని మూడేళ్లుగా గ్రౌండ్ రియాలిటీలో ఈఎన్ఎస్ నెట్వర్క్ పరిశీలించింది. అలా పరిశీలించిన విషయాలను, అంశాలను అటు ప్రభుత్వం, ఇటు ప్రజల ద్రుష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో కొందరు ఐఏఎస్ అధికారులు నొచ్చుకున్నా..మరికొందరు మెచ్చుకున్నా.. కేవలం ప్రభుత్వ లక్ష్యం వారు చేసె తప్పుల కారణంగా ఏవిధంగా అభివ్రుద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాలని సంకల్పించాం. ఇదే సమయంలో కొన్ని విషయాలను రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడిన సమయంలో తెలిసిన అంశాలను కూడా వార్తల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అహర్నిసలు శ్రమిస్తుంటే..అదే సమయంలో ఐఏఎస్ లతో పాటు ఇతర సివిల్ సర్వీసు అధికారులు కాస్త ఉదాసీనంగా వ్యవహరించడం, కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించడం వలన జరిగే అనర్ధాలను కూడా ఈ దారావాహికంలో అందించే ప్రయత్నం చేస్తాం.

 కేవలం అధికారులు ఆ విధంగా చేయడం వలన..ఇప్పటి వరకూ ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎందుకు చేరలేదనే విషయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాం. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా మేము అందించే కధనాలు సూచనలుగా ఉంటాయని కూడా భావిస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పాలన ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలంటే జిల్లాకి ముఖ్యమైన అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తే ఫలితాలు వస్తాయనే విషయంలో మేము మూడేళ్లుగా పరిశీలించిన విషయాలను అందిస్తాం. మేము అందించే కధనాలు మీకు నచ్చితే మీరు మీకు తెలిసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ద్రుష్టికీ కూడా తీసుకెళ్లవచ్చు. సివిల్ సర్వీస్ అధికారుల తప్పులు ఎంచేటంత తోపులం అని చెప్పడం లేదు గానీ..కేవలం ఆ విధంగా జరగడం వలన జరిగిన అనర్ధాన్ని మాత్రమే తెలియజేయాలని సంకల్పించాం.. వచ్చే కధనంలో ఏ ప్రభుత్వ శాఖలో ఏ తప్పు జరిగిందో, దానిని జిల్లా కలెక్టర్ నుంచి ఇతర సివిల్ సర్వీస్ అధికారులు ఎందుకు వాటిని పట్టనట్టు వదిలేశారనే విషయాతో మీముందుకి వస్తాం..!