ఏపీలో జిల్లా కలెక్టర్లు చేసే అతిపెద్ద తప్పులు-1


Ens Balu
195
Tadepalli
2022-10-22 03:17:53

రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది..జిల్లా కలెక్టర్ మంచి అధికారి, ప్రజా సంక్షేమం కోరుకునే అధికారిగా వ్యహరిస్తే జిల్లా అభివ్రుద్ధి పధంలో ముందుంటుంది. ఒక జిల్లాలో 75 ప్రభుత్వ శాఖలకు కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. అలాంటి జిల్లా కలెక్టర్ తన విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించడం వలన, కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై మూడేళ్లు దాడుటుతున్నా నేటికీ ఇక్కడ అందే సేవలేంటో ప్రజల్లో అవగాహన లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతీరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ వాటి అమలు ఎక్కడా జరగడం లేదనే విషయం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చే దరఖాస్తులే స్పష్టం చేస్తున్నాయి. అసలు ప్రభుత్వం సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించిన స్పందన కార్యక్రమాన్ని ఎందుకు జిల్లా కలెక్టర్లు అమలు చేయించలేకపోతున్నారనే ప్రశ్నకు వారి దగ్గరే సమాధానం లేదు. ఇదేదో కావాలని అంటున్నమాటలు కావు..రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ లెవ్ లో ఈఎన్ఎస్ నెట్వర్క్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తెలియజేస్తున్న విషయాలు. తమకు అవసరమైన ద్రువీకరణ పత్రాలకోసం అర్జీలు పెట్టుకున్నవాటినే సచివాలయంలో స్పందన దరఖాస్తులు సిబ్బంది చూపిస్తున్నారు. వాటి ద్వారానే మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు సచివాలయా సిబ్బంది. ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్లు తమ సచివాలయాల పర్యటనల్లో గుర్తించకపోవడం విశేషం.

ముందస్తు సమాచారంతోనే జిల్లా కలెక్టర్లు, జెసిల పర్యటనలు
జిల్లా కలెక్టర్, జెసిలు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే సమయంలో మండల అధికారులకు సమాచారం ముందుగా అందించిన తరువాతే సందర్శనలు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా అక్కడ సిబ్బంది అలెర్ట్ అయిపోతున్నారు. దీనితో అక్కడ లోపాలను కలెక్టర్ గుర్తించడానికి వీలుపడటం లేదు. అందులోనూ సచివాలయాలను సందర్శించే సమయంలో కొందరు జిల్లా కలెక్టర్లు సిబ్బంది డ్యూటీ చార్టులు, రిజిస్టర్ లను తనిఖీలు చేయడం లేదు. పరిస్ధితిని సాధారణంగా కనుక్కోవడం తప్పితే, నవరత్నాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యల దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి.. అసలు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం జరుగుతుందా..జరిగితే ఎన్ని అర్జీలు స్వీకరించారు..ఎన్ని పరిష్కరించారు.. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయాలనికి ఎందుకు దరఖాస్తులు అధికంగా వస్తున్నాయనే విషయాన్ని ఒక్క సచివాలయ సిబ్బందినిగానీ, మండల అధికారులను గానీ ప్రశ్నించినట్టు ఇప్పటి వరకూ కనిపించలేదు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు మాత్రం తమ పర్యటనల విషయం మండల అధికారులకు, సచివాలయ సిబ్బందికి తెలియకుండా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలా చేసిన సమయంలో వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి వీలుపడుతుంది. అలాంటి చోట్ల కాస్త అధికారులతో భయంతోనైనా స్పందన కార్యక్రమాన్ని అప్పుడప్పుడైనా నిర్వహిస్తున్నారు.

సచివాలయ సిబ్బంది ధరించే యూనిఫాంపై ద్రుష్టేది..?
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం కాకుండా వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఎల్లప్పుడూ సివిల్ డ్రెస్సుల్లోనే సిబ్బంది దర్శనమిస్తున్నారు. అదేమంటే ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం బ్యాండ్ మేళం డ్రెస్సులా ఉందనే బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి సచివాలయానికి రాగానే యూనిఫారంలో ఉన్నవారంతా సచివాలయ సిబ్బంది అని గుర్తించడానికి ప్రభుత్వం ఉద్యోగులకు యూనిఫారం ఇచ్చింది. అయితే దానికి విరుద్దంగా సిబ్బంది వ్యవహరిస్తున్నా చాలా జిల్లాల్లో కలెక్టర్లుగానీ, జెసిలుగానీ..అక్కడే ఉండే మండల అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ముందుగా కలెక్టర్ పర్యటనలు చేస్తున్న సమాచారం మండల అధికారులకు అందించడంతో  వచ్చే సమయానికి మాత్రం యూనిఫారాల్లో సిబ్బంది దర్శనమిస్తున్నారు. అప్పుడు కూడా షర్ట్ సచిలయానిది ఫ్యాంట్ వేరే రంగులో ఉన్నదీ ధరిస్తున్నారు. ఆ సమయానికి, ఆ తేదికి రికార్డులు సిద్దం చేస్తున్నారు. సచివాలయ పరిశరాల్లో బ్లీచింగ్ లు చల్లి జిల్లా కలెక్టర్ ద్రుష్టిలో తామంతా సక్రమంగా ఉన్నట్టు కలరిస్తున్నారు. అంతే తరువాత రోజునుంచి మళ్లీ సివిల్ యూనిఫారంలోనే వస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ కార్యదర్శిలే ఈ విధంగా చేస్తున్నారు. తమ కార్యదర్శి యూనిఫారం వేసుకు రాకుండా వస్తే లేనిది తామెందకు వేసుకోవాలంటూ మిగిలిన సిబ్బందికూడా లైట్ తీసుకుంటున్నారు. దీనితో సచివాలయానికి వచ్చే ప్రజలకు ఎవరు సచివాలయ ఉద్యోగులో.. ఎవరు సాధార ప్రజలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో కనీసం మండల అధికారులు కూడా సిబ్బందిని ప్రశ్నించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

జిల్లా కలెక్టర్లకి తగ్గిపోయిన పరిధి..అయినా ఎక్కడి సమస్యలు అక్కడే
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన తరువాత 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. అంటే అదనంగా 13 మంది జిల్లా కలెక్టర్లు, 13 మంది జాయింట్ కలెక్టర్లు కొత్తగా వచ్చినా.. ఉమ్మడి జిల్లాలు విభజన జరిగి విస్తీర్ణం, వారి పరిధి తగ్గిపోయినా జిల్లాల్లో ప్రధాన సమస్యలు ఎక్కడివి అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామ, వార్డు స్థాయిలో కార్యాలయాలు.. సుమారు 10 నుంచి 19 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించినా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. నేటికీ సచివాలయాల్లో అందే సేవలు, సిబ్బంది ఎవరు, ఏఏ ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా ఉన్నారో.. ఆ ప్రాంత ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో.  గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలు లక్షా 23వేల మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినా.. ఫలితాలు మాత్రం మూడేళ్లు దాటిపోతున్నా కనీసం 20శాతం కూడా మెరుగు పడలేదు. జిల్లా కలెక్టర్లు పర్యటనలు చేసే సమయం మందుగా సమాచారం అందుకొని..కలెక్టర్లను సిబ్బంది, మండల అధికారులు బురిడీలు చేస్తున్నారు తప్పితే వాస్తవానికి సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందులోనూ మండలశాఖల్లోనూ రెగ్యులర్ అధికారులు లేకపోవడం, 70శాతం ఇన్చార్జిల పాలనతో ఉండటంతో ఈ సమస్య మరింత జఠిలం అవుతోంది.  గ్రామస్థాయిలో నేరుగా పది ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉన్నా, గ్రామసచివాలయం ఉన్నా స్పందన కార్యక్రమం మాత్రం జరగడం లేదు. అలా జరిగితే సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేవనే విషయాన్ని కలెక్టర్లు గుర్తించకపోవడం విశేషం. కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ విధంగా బురిడీ కొట్టించే సిబ్బందిని కలెక్టర్లు, జెసిలు సస్పెండ్లు చేస్తున్నారు. ఆ పరిస్థితి రాష్ట్రమంతా జరిగితే విషయం వేరే లెవల్ ఉంటుందనడంలో సందేహమే లేదు.

జిల్లా కలెక్టర్లు, జెసిలు తనిఖీలు చేయనవి ఇవే..
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ చాలా వరకూ జిల్లా కలెక్టర్లు, జెసిలు,  గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లే సమయంలో తనిఖీ చేయని అంశాలు క్రమ సంఖ్యలో తెలుసుకుంటే.. గ్రామాల్లోకి సిబ్బందిని తీసుకెళ్లి వీరిలో ఎంతమంది గ్రామస్తులకు తెలుసు అని ప్రశ్నించడం, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైనేజిల సమస్యలు, సిబ్బంది డ్యూటీచార్టులు, రిజిస్టర్ల నిర్వహణ, సిబ్బంది యూనిఫారం ధరించకపోవడం, ముఖ్యంగా సచివాలయాల్లో స్పందన నిర్వహంచని అంశం, శాఖల వారీగా వచ్చిన అర్జీలు, పరిష్కరించిన సమస్యలు, ప్రధానంగా పరిష్కారించాల్సిన సమస్యలు, కార్యదర్శిలు ఏ విధంగా సచివాలయాలు నిర్వహిస్తున్నారు..అందుబాటుల్లో ఉంటున్నారనే అంశం, సచివాలయ సేవలను సిబ్బంది ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తున్నారనే విషయం, కలెక్టర్ల పర్యటన సమయంలోనే కాకుండా నెలలో ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ పారిశుధ్య నిర్వహణ చేస్తున్నారు, బ్లీచింగ్ లు చల్లుతున్నారు, దానికోసం ఫినాయిల్, ఫాగింగ్ ఇతర వాటికి ఎంత మొత్తం లో ఖర్చు చేస్తున్నారు. అసలు చెత్తను పారిశుధ్య కార్మికులు ఏఏ ప్రాంతాల్లో..ఏఏ రోజుల్లో చేస్తున్నారు..? ఎంత మొత్తంలో లెక్కలు చూపిస్తున్నారు..తీసుకు వచ్చిన ఫలితాలేంటి, ముఖ్యంగా సచివాలయాలను నిర్వహించే కార్యదర్శిల రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? అసలు నిర్వహిస్తున్నారా లేదా? ప్రభుత్వ ఉత్తర్వులు అసలు నోటీసుబోర్డులో పెడుతున్నారా లేదా.. ఎన్ని ప్రభుత్వ ఉత్తర్వులను సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎన్ని ఉత్తర్వులను రిజిస్టర్లు వారీగా నమోదు చేస్తున్నారు. సచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బందికి ప్రధాన వీధులు, వాలంటీర్లు గ్రామంపై ఎంత పట్టుంది..? తదితర అంశాలను జిల్లా కలెక్టర్లుగానీ, జెసిలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు..

ముఖ్యగమనిక.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలనే తొలుతగా ఎందుకు తెలియజేశామంటే..ఏపీలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ శాఖపై అన్ని అంశాలను ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఏకకాలంలో తెలియజేస్తూ వస్తున్నాం. నిజంగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు, సిబ్బంది ప్రజలకు చేరువ అయ్యేవారు. కానీ అలా జరగలేదు. కొన్నిచోట్ల జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ లక్ష్యం మేరకు శ్రమిస్తున్నా,  పనిచేయని సిబ్బందిని సస్పెండ్లు చేస్తున్నా, మార్పు తీసుకురావాలని చేపడుతున్న చర్యలు.. ఫలితాలు అంతంత మాత్రంగానే వుస్తున్నాయి. ఆ కారణంతోనే ఈ పరిశోధనాత్మక కధనం అందించాల్సి వచ్చింది. ఈ విషయంలో మండలం అధికారులు కూడా జిల్లా కలెక్టర్లు, జెసిలు ఇతర జిల్లా అధికారులను బురిడీలను చేస్తున్నారు. మండల అధికారులు ఏవిధంగా జిల్లా కలెక్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారే విషయానికి సంబంధించిన వివరణాత్మక కధాన్ని వచ్చే కధనాల్లో అందిస్తాం. 

చివరిగా ఒక్క మాట.. దేశంలో అత్యున్నత ఉద్యోగం ఐఏఎస్..అలాంటి ఐఏఎస్ లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం ఏకకాలంలో జరుగుతుంది. వారికి ఈఎన్ఎస్ ద్వారా కేవలం క్షేత్రస్థాయిలో జరగుతున్న విషయాలను, వాస్తవాలను మాత్రమే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ లక్ష్యం ఏ తప్పిదం వలన వెనెకబడిపోతుందో తెలియజేయాలని మాత్రమే గ్రౌండ్ లెవల్ లో మా నెట్వర్క్ ద్వారా సమాచారం సేకరించి ఈ విషయాలను తెలియజేశాం. వచ్చే కధనంలో మండల అధికారుల విషయంలో జరుగుతున్న తప్పులను వివరించే ప్రయత్నం చేస్తాం..!