సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతికి తీపి కబురు


Ens Balu
167
Tadepalli
2022-11-08 01:49:54

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపికబురు అందనుంది. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతి నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలపై విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నందున ఉద్యోగులను బదిలీలు చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ల ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టినట్టు సమాచారం. మూడేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు బదిలీలు చేసి ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యుగులు, రెగ్యులర్ అయిన ఉద్యోగుల వివరాలను శాఖల వారీగా క్రోడీకరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తం సుమారు ఒక లక్షా 22 వేలకు పైగా ఉన్న ఉద్యోగులను జీఓఎంఎస్-5 ద్వారా ప్రభుత్వం సర్వీస్ ప్రొభేషన్ డిక్లరేషన్ చేసింది. అలా చేసిన ఉద్యోగులు, ఆ తరువాత కారుణ్య నియామకాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చేరిన ఉద్యోగులు, మధ్యలో పదోన్నతులు పొంది చేరిన కొత్త ఉద్యోగులు ఇలా అందరు ఉద్యోగుల జాబితాలను ప్రభుత్వం ఒక ప్రత్యేక జాబితాగా రూపొందిస్తున్నది. అందులో మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులను మాత్రం బదిలీ చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే సాధారణ ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికి అన్ని రకాల సదుపాయలు, బదిలీల నియమ నిబంధనలు వర్తిస్తాయా, లేదంటే ప్రత్యేకంగా నిబంధనలు రూపొందిస్తున్నారనే అనే అంశంపై ప్రభుత్వశాఖల కమిషనర్లతో చర్చలు జరుపుతున్నారని కూడా సమాచారం అందుతుంది. అన్ని ప్రభుత్వశాఖల రెగ్యులర్ ఉద్యోగులు లా అయితే వీరికి కూడా స్థానిక జిల్లాల బదిలీలతోపాటు, అంతర్ జిల్లా బదిలీలు కూడా జరిగే అవకాశం వుంది. లేకపోతే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆ అవకాశాన్ని కల్పిస్తూ జీఓ జారీ చేయాల్సి వుంటుందని ఓ ఉన్నతాధికారి తెలియజేశారు.

మొన్నటి వరకూ డిసెంబరు నాటికి బదిలీల ప్రక్రియ జరుగుతుందని భావించినా.. రాష్ట్రప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖపై ఉన్నతాధికారులు విదివిధానాలు రూపొందించకపోవడం వలనే ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు. ఈలోగా ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామిపై సంక్రాంతి నాటికి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసి ఆ తరువాత మార్చి లోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. అయితే సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర  
సమయం ఉన్నందున ముందుగా బదిలీలు చేపడితే ఆ తరువాత మళ్లీ ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశాలపైనా ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తున్నది. 2024ఎన్నికలు ఆరు నెలల సమయం ఉందనగా ఒకే చోట మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాల్సి వుంటుంది. ఆ విధంగా బదిలీలు చేస్తారా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం  ప్రత్యేక నియమ నిబంధనలు రూపొదించి బదిలీలు చేస్తారా అనే విషయం ఇంకా బయటకు రాలేదు. చూడాలి సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు సంబధించి ఏ విధమైన ప్రకటన జారీ చేస్తుందనేది..!