ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖుల కార్యక్రమాలు జరిగే ప్రదేశంలో నోడ్రోన్ జోన్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ లు పై నుంచి చిత్రీకరణ చేసే సమయంలో అసాంఘిక కార్యక్రమాలు, ప్రమాదాలు జరగవచ్చుననే ముందస్తు సంకేతాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా సభాస్థలం వద్ధ డ్రోన్ కెమెరాలతో షూట్ చేయాలనుకుంటే ముందుగా నగర పరిధిలో అయితే సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా పరిధిలో అయితే జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి వుంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్
లు ఆపరేట్ చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, కార్యక్రమాల సమయాల్లో సైతం డ్రోన్లను నిషేదిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఇదే విధంగా ప్రముఖుల కార్యక్రమాలు జరిగే సమయంలో ముందస్తు ప్రకటనలు చేయనున్నారు. అవసరాన్ని బట్టి వాటిని ప్రభుత్వమే చేపట్టే విధంగా అనుమతులు మంజూరు చేయనున్నారు.