మావోయిస్టు కార్యకలాపాలు ఎఓబిలో ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు ఏపీ డీజిపీ డిజిపీ కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల నియంత్రణకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రభుత్వం సహాయ సహకార కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పిస్టున్నట్టు చెప్పారు. మావోయిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపి పిలుపునిచ్చారు. కాగా జిల్లాల
పునర్విభజనతో ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించామన్నారు. సిబ్బంది, వాహనాలు, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల్లో చాలా వరకు సమస్యలు లేకుండా పరిష్కరించామన్నారు. పోలీసు నియామకాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.ఈ మీడియా సమావేశంలో శాంతిభద్రత విభాగం అదనపు డిజి డా. రవిశంకర్ అయ్యన్నార్, విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. దీపిక పాటిల్ పాల్గొన్నారు.