ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాస్త ఆలస్యం..!


Ens Balu
74
Tadepalli
2022-11-14 12:53:20

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6500 పోలీసు కానిస్టేబుల్ నియామకాల విషయంలో కాస్త జాప్యం జరిగే అవకాశాలు కనిస్తున్నాయి. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని రకాల అంశాలను ప్రభుత్వం  పరిశీలిస్తుందని ఏపీ డీజిపి కేవి రాజంద్రనాధ్ రెడ్డి ప్రకటించడం దానికి బలం చేకూరింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటులో మహిళా పోలీసులను నియమించిన విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే అలాంటి ఇబ్బందులు త్వరలో తీయబోయే భారీ నోటిఫికేషన్ లో రాకూడదనే ఉద్దేశ్యంలో అన్ని అంశాలను ప్రభుత్వం  పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది.  ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుళ్లు, ఎస్ఐల సంఖ్య పెరగడం, తగ్గడం, కొన్ని కుదించుకుపోవడం, మరికొన్ని పదోన్నతులలో పోవడం ఇలా చాలా వరకూ సాంకేతిక అంశాలను పోలీసుశాఖ పరిశీలస్తున్న విషయం మరోసారి డిజిపీ మాటల్లో తేటతెల్లం అవుతుంది.  అయితే నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కాగా వస్తుందని మాత్రం ఆయన చెప్పారు. తీరా నోటిఫికేషన్ జారీ అయిన తరువాత ఏ ఒక్క అభ్యర్ధి ఇబ్బందులు పడకూదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పోలీసు ఉద్యోగాలకు  సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, దీనిపై ఇప్పటికే డిజిపి కార్యాలయం నుంచి కూడా చాలా సమాచారం ప్రభుత్వం సేకరించిందని చెబుతున్నారు. నవంబరు నెలాఖరుకి తొలుత నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం 5నెలల్లో ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని తొలుత ప్రభుత్వం భావించినట్టుగా చెబుతున్నారు. అయితే తాజా నోటిఫికేషన్ విషయంలో సమస్యలు తలెత్తితే అభ్యర్ధులు ఎక్కడా నష్టపోకుండా 
ఉండేందుకు, వయస్సు విషయంలోనూ కాస్త మార్పులు చేసే అవకాశాలున్నట్టు కూడా సమాచారం అందుతంది. చూడాలి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి సమస్యలను అధిగమించి ప్రకటన జారీ చేస్తుందనేది..!