ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)ల్లో ని సిబ్బంది హాజరు కోసం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ని అమలులోకి తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారానే ప్రస్తుతం ఉద్యోగులంతా అటెండెన్సు వేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి అటెండెన్సు వేసిందీ లైవ్ లోకేషన్ తో సహా నమోదవుతోంది. ఒక పీహెచ్సీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతమంది ఏ సమయానికి అటెండెన్సు వేశారు.. ఎంత మంది లీవ్ లో ఉన్నారు. ఇంకా ఎంతమంది అటెండెన్సు వేయాల్సి వుంది తదితర వివరాలన్నీ డాక్టర్ డాష్
బోర్డులో దర్శనమిస్తున్నాయి. ఈ విధానం ద్వారానే సిబ్బందితోపాటు వైద్యునితో సహా అటెండెన్సు వేస్తున్నారు. ఉదయం పదిగంటలకు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇన్ మరియు ఔట్ తప్పనిసరిగా అటెండెన్సు వేయాల్సి వుంటుంది. ఈ అటెండెన్సు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంతోపాటు, చివాలయంలోని రాష్ట్ర కార్యాలనికి అనుసంధానించారు. త్వరలోనే ఓపీ సేవలు కూడా ఆన్
లైన్ చేస్తారని వైద్యఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా తెలియజేశారు.