2024లో YSRCP ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కేదెవరకో..!


Ens Balu
455
Tadepalli
2022-11-17 07:44:36

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి కేవలం 16నెలలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ఆశపడుతున్నవారు..ఆందోళన పడుతున్నవారు అధిమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాలను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. దానికి అనుగుణంగా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. అదికూడా పార్టీకోసం ఎవరు ఏవిధంగా పనిచేశారు.. ఎంతమేర కష్టపడ్డారు..వారికి నియోజవర్గంలో ఫాలోయింగ్ ఎలావుంది..ప్రలజకు, యువతకు ఎమ్మెల్యే అభ్యర్ధి ఏస్థాయిలో దగ్గరగా ఉన్నారు..గెలుపుశాతం ఎంతవుంది.. ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఏం చెబుతున్నాయి.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మరీ దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ అధినేత చేస్తున్న సూచనలు నేతల్లో కొండంత బలాన్ని పెంచుతున్నా.. కాస్త తేడాగా ఉండి, ప్రజల్లో పేరు 
పోగొట్టుకొని, క్యాడర్ దగ్గర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం అపుడే గుండెల్లో దడ మొదలైంది.

గెలిచే అభ్యర్ధులకే టిక్కెట్ అదిమాత్రం పక్కా..
వైఎస్సార్సీపీలో ప్రభుత్వంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వున్నవారికి సైతం సీఎం వైఎస్ జగన్ చేతిలో వున్న నివేధికల ఆధారంగా కేలం గెలిచే అభ్యర్ధులను, వారి నియోజకవర్గాలను మాత్రమే ముందుగా తాడేపల్లి పిలుపించుకొని సమీక్షలు చేస్తున్నారు. దానితో ప్రస్తుతం వున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరికి సీటు వస్తుందో అపుడే చాలా మందికి క్లారిటి వచ్చేసింది. అలా క్లారిటీ రావడం కోసం అలాంటి నియోజవర్గాలను ఆఖరున సమీక్షించాలని..అక్కడ మరో నేత ఎవరిని పెడితే ఆ స్థానం కైవసం చేసుకోవచ్చో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారని సమాచారం అందుతుంది. ఈ 
విషయంలో ఎక్కడా రాజీలేకుండా వ్యవహరిస్తే తప్పా 175కి 175 స్థానాలు గెలవడంలో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందనే సంకేతాల నడుమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇచ్చిన ఎన్నికల హామీలు పెద్ద ఎత్తున నెరవేర్చడం, సాధారణ ప్రజానికానికి దగ్గరైన తరుణంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకగా మారాలన్నది సీఎం అభిమతంగా కనిపిస్తుంది.  ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పథకాలు పొందని వారు, పదవులు రానివారు, రెబల్స్ , ఇతర పార్టీలకు జంప్ అవుదామనుకున్నవారు ఉన్నప్పటికీ చాకచక్యంగా వ్యవహరిస్తే గెలుపు మనదేననే సంకేతాలను బలంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది.

విశాఖలో ఎమ్మెల్యేటిక్కెట్టుపై బోణీ కొట్టిన కెకె.రాజు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడురాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్న సమయంలో.. అది విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసే విశాఖపట్నం జిల్లా నుంచి తొలుత ఉత్తర నియోజకవర్గం సీటును ప్రస్తుతం ఇన్చార్జి కెకె.రాజు కైవసం చేసుకొని బోణి కొట్టారు. ఇంకా విశాఖజిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, విశాఖ పడమర అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి వుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్చార్జిలకే సీట్లు ఇస్తారని చెబుతున్నా.. నియోజకవర్గాల సమీక్షలు పూర్తయితే తప్పా 
ఎవరికి ఎమ్మెల్యే సీటు వస్తుందో అనేదానిపై క్లారిటీ రాదు. ఈస్థానాలతోపాటు విశాఖ ఎంపీ సీట్లుకి అభ్యర్ధులను ఖరారు చేయాల్సి వుంది. ప్రస్తుతం విశాఖ నుంచి కొందరు సదరు నియోజకవర్గాల నుంచి సీట్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో వారికి కేటాయించిన సీట్లను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మరికొందరు నేతలకు కేటాయించడంతో ఈసారికి వారికి సీటు కేటాయించే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

2024 ఎన్నికల్లో విశాఖలో కీలకం కానున్న కార్పోరేటర్లు 
2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఈసారి కార్పోరేటర్లు చాలా కీలకం కానున్నారు. దానికోసం ఇప్పటి నుంచే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నియోజకవర్గాల సమీక్షలో కార్పోరేటర్లు, అక్కడి నేతలను కూడా పిలిచి  ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ప్రతీ ఒక్క కార్పోరేటర్ నుంచి, అక్కడ వివిధ కార్పోరేషన్లలో చైర్మన్ లుగా ఉన్నవారు,డైరెక్టర్లుగా ఉన్నవారు, మహిళా నేతలు ఇలా అందరితోనూ మాట్లాడి అక్కడి తాజా పరిస్తితిని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలోని కేడర్ ని అంతా సద్వినియోగం చేసుకొని ఈసారి ఎలాగైనా 
జీవిఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే కార్పోరేటర్లు..స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఒక్కటే మార్గమని..దానికోసం ముందు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తప్పా స్థానాలు గెలుచుకోవడం కష్టమని భావించి ముందుగానే కార్పోరేటర్లను కీలకంగా మార్చడానికే నియోజవర్గస్థాయి సమావేశంలో వారికి పెద్ద పీట వేశారని చెబుతున్నారు. అదే సమయంలో ఈ 
మూడున్నర సంవత్సరాల్లో కష్టపడి పనిచేసినా..పదవులు దక్కని వారికి వచ్చే ప్రభుత్వంలోగానీ, ఈఏడాదిన్నరలో గానీ పదవులు ఇస్తామనే సంకేతాలు కూడా వదిలినట్టు తెలుస్తుంది.

ఆఖరి వరకూ ఆశావాహులు గాల్లోనే..
2019లో వరకూ పార్టీకోసం కష్టపడి పనిచేసి, సీటు దక్కని నేతలు, రెబల్స్, సీటు కోసం ఆశించేవారి పేర్లు ప్రస్తుతం సీల్డు కవర్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారిని ఆఖరి నిమిషం వరకూ అలాగే వుంచి. ప్రజల్లో వ్యతిరేకత వున్న ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానంలో వారిని సర్ధుబాటు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నా..ఆఖరివరకూ మాత్రం వారు అలా గాల్లోనే ఉండాలనే సంకేతాలు వెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే 175 నియోజవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావాహుల జాబితా మొత్తం తన చేతుల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కేవలం గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రంపై స్వారీ చేసే బలమైన నాయకులకే తొలుత సీట్లు ఇస్తామని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ తరుణంలో లైంగిక వేధింపులు, సోషల్ మీడియలో తప్పుడు ప్రచారం పొందిన వారు, నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటూ వారి కార్యకలాపాలు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, అదే సమయంలో పార్టీనే అంటిపెట్టుకుని ప్రజలకు, కేడర్ కు 
సహాయం చేస్తున్న నాయకుల పేర్లు కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ చలికాలంలో మొదలైన ఎన్నిక వేడి ఎవరికి మంట పెడుతుంతో, ఎవరిని చల్లబరుస్తుందో..ఎవరికి సీటు కన్ఫర్మ్ చేసి.. మరెవరికి రిక్త హస్తం మిగులుస్తుందో అన్ని నియోజకవర్గాల సమీక్షలు పూర్తయితే తప్పా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. ఆ తరువాత కూడా లాస్ట్ హవర్ లో గోల్డెన్ ఛాన్సు కొట్టే నేతలు ఉన్నారని చెబుతున్నారు కేడర్..!