వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ గెలవాలి.. మీరేం చేస్తారో నాకు తెలియదు.. ప్రభుత్వ పరంగా ఇచ్చి హామీలన్నీ నెరవేర్చాం.. వచ్చే మన ప్రభుత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇక ప్రజలకు చేరువయ్యే బాధ్యత మీదే. ప్రజల్లో ఉన్నవారినే అంతా ఆదరిస్తారు.. గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం పెట్టింది కూడా అందుకే.. ఈసారి గెలుపు అవకాశం లేనివారికి సీటు ఇచ్చేదిలేదు అంటూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలకు తెగేసి చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్చార్జులు, సమన్వయకర్తలతో సమీక్షించిన జగన్ ఖారాఖండీగా విషయాన్ని కుండ బద్దలు గొట్టారట. జగన్ ఇచ్చిన క్లాసు ఆధారంగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 40శాతానికి పైగానే అభ్యర్దులకు సీట్లు కోల్పేయే ప్రమాదం ఉన్నట్టుగా సూచాయగా చెప్పటినట్టు తెలిసింది. దీనితో ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో అనే అనుమానాలు అపుడే పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అందులోనూ రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా నియమించిన ఇన్చార్జిలు కూడా తమ రిపోర్టులను నిష్పక్షపాతం ఇవ్వలేనట్టు తెలిసింది. మరికొంత మంది సమన్వకర్తలు ఉన్నది ఉన్నట్టుగా రిపోర్టులు నియోజవర్గంలోని పరిస్థితిని సీఎం జగన్ ముందు ఉంచడంతో అధినేత ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.
ప్రజల్లో పట్టు లేకపోతే సీటు ఇచ్చినా వృధా..
గత ఎన్నికల్లో సమయంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినహామీలన్నీ అమలు చేశాం. అయినా కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరకాలేకపోవడం దారుణం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా వుందో ఎప్పటికప్పుడు సమాచారం మొత్తం అంతా నాకు అందుతుందని నియోజకవర్గ ఇన్చార్జిలకు చెప్పారట జగన్. ప్రస్తుత నియోజవకర్గాల్లో కో-ఆర్డినేటర్ల పరిస్థితి బాలేకపోవడంతోనే కొత్తవారిని నియమించాం. అయినా మార్పురాలేదని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇలా అయితే ప్రజల్లో పట్టు కోల్పోతే సీటు ఇచ్చినా వృధా అయిపోతుంది. తీరుమార్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రజల్లోనే ఉండాలి. వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం చెప్పినట్టుగా 175కి 175 రావాల్సిందేనని దానికోసం మీరు ఏం చేస్తారో..ప్రజలను ఏ విధంగా మచ్చిక చేసుకుంటారో తెలియదని తేల్చిచెప్పారట. అన్ని విషయాల్లోనూ ప్రజలకు చేరువగా ఉంటేనే నెగిటివ్ ప్రచారాలకు ఆస్కారం వుండదని.. అదే సమయంలో ప్రభుత్వంపై వచ్చే అసత్య ప్రచారాలను తప్పికొట్టాలని కాస్త గట్టిగానే చెప్పినట్టు సమాచారం.
సీట్లన్నీ తెచ్చేపూచీ మాది భరోసా ఇచ్చిన ఇన్చార్జిలు
రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు గెలిపించి తీసుకు వచ్చే బాధ్యత తమదని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డికి భరోసా ఇచ్చారట. తమపై పెట్టిన నమ్మకాన్ని సీట్లు గెలిపించి బహుమతిగా తీసుకు వస్తామని నియోజకర్గాలకు ఇన్చార్జిలుగా నియమింప బడ్డవారంతా ముక్త కంఠంతో చెప్పినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అక్కడ ఏమేం కావాలో, ఎలాంటి అభివ్రుద్ధి పనులు చేయాలో, ఏ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఉంది.. ఎవరి నుంచి మంచి ప్రోత్సాహం వుంది తదితర అంశాలన్నింటిపైనా దృష్టిపెట్టి నియోజకవర్గాలన్నింటిని మనవైపు తిప్పుకోవాలని జగన్ ఇన్చార్జిలకు సూచించారట. నియోజకవర్గాల్లో అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి అక్కడ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపాలని, ముఖ్యంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు స్వీకరించి పరిష్కరిస్తే ప్రజల్లో మనపై నమ్మకం పెరుగుతుందని సీఎం ఇన్చార్జిలకు క్లాస్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాగా కొత్తగా ఇన్చార్జిలు నియమించిన వారిలో కొన్ని నియోజకవర్గాల్లో వారు వాస్తవ పరిస్థితిని నివేదికల రూపంలో ఇవ్వడం పట్ల జగన్ సంతృప్తి వ్యక్తం చేశారట.
ఎమ్మెల్యేలతో సమావేశం నాటికి పక్కా రిపోర్టులు అందాలి
త్వరలో ఎమ్మెల్యేలతో మరోసారి సమీక్ష నిర్వహిస్తాం ఆ నాటికి 175 నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితిని నా ముందుంచాలి అపుడు ఎవరెవరకి సీటు వచ్చేది.. ఎవరికి సీటు నిరాకరించేంది తేల్చి చెప్పేస్తా అని సీఎం తెగేసి చెప్పారట. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం. ఇంటి ముంగిటే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. అయినా కొంతమంది ఎమ్మెల్యేల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందంటే వారు ప్రజల్లో లేరని..వారికి ప్రజాభిమానం లేదని అర్ధమవుతుంది. అలాంటి వారి వలన పార్టీకి ప్రభుత్వానికి నష్టం రాకూడదు. ఈ విషయంలో ఇన్చార్జిలు చాలా ఖచ్చితత్వంగా వ్యవహరించాలని ఇన్చార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడిన క్రమంలో జగన్ సూచించారట. సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో అక్కడి ప్రజల నుంచి వస్తున్న స్పందన అక్కడ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఉందనే విషయం తెలిస్తేనే మనం దైర్యంగా ముందుకి వెళ్లడానికి ఆస్కారం వుంటుందని..ఆ విషయాలను కనుక్కోవడానికే మిమ్మల్ని అక్కడ నియమించామనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దని చెప్పారట. మీతోపాటు ఎమ్మెల్యేలకు సమావేశం నిర్వహిస్తాం. అప్పటికి అంతా ప్రజాభిమానంతో, వారి పట్ల నూశాతం నమ్మకంతో రావాలి..లేదంటే నా పనినేను చేస్తానని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఇన్చార్జిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక బలమైన సందేశాన్ని సీఎం జగన్ పంపినట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఈరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే తీరులో మార్పు కనిపించే అవకాశం వుంది.. చూడాలి రాజకీయ ముఖ చిత్రం ఆ 40% మందిలో ఎలాంటి మార్పు తీసుకు వస్తుందనేది..!