అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం సత్యగిరి కొండపైనఉన్న హరిహర సదన్ భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శనివారం నుంచే భక్తుల సౌకర్యార్ధం గదులు భక్తులకు కేటాయించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్టు దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు సత్రము వద్దనే రూమ్స్ భక్తులకు కేటాయిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. భక్తుల ఈవిషయాన్ని గమనించి హరిహర సదన్ సత్రము గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.