ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ లో ప్రకటించిన 92 పోస్టులకు ఏకంగా ఒక లక్షా 26వేల 449 మంది దరఖాస్తు చేస్తున్నారు. అంటే కేవలం దరఖాస్తుల ద్వారానే 4 కోట్ల 67 లక్షల 86వేల 130 రూపాయాల ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజు రూ.250 కాగా ప్రాసెసింగ్ ఫీజ్ రూ.120 అభ్యర్ధిలు చెల్లించారు. దీనితో ఏపీపీఎస్సీకి భారీగానే ఆదాయం సమకూరింది. కాగా సర్వీస్ కమిషన్ ఈనెల 8వ తేదీన గ్రూప్ -1 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎంత మంది పోటీపడుతున్నారనే విషయం ఆరోజు సాయంత్రానికి గాని తెలీదు.