హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. నాంపల్లి నుమాయిష్ కు వచ్చే సందర్శకుల కోసం మెట్రో సేవలను మరో గంటపాటు పొడిగించింది. దీనితో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఎల్బీనగర్, నాగోల్, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల నుండి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో బయల్దేరనుంది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం రూట్లలో మాత్రమే మెట్రో వేళలను పొడిగించారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో ప్రయాణించాలకునేవారికి మెట్రో చాలా ఉపయుక్తం కానున్నది.