తిరుమలలో సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
Ens Balu
6
Tirumala
2020-09-23 20:01:19
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. వీరికి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాధ్ జెట్టి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, వేణు గోపాలకృష్ణ, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉంటారు. తొలిరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత, మరుసటిరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత తిరిగి పయనమవుతారు.