ఉదయం 6 గంటల నుంచే వైకుంఠద్వార సర్వదర్శనం


Ens Balu
10
Tirumala
2023-01-02 13:34:02

సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం ప్రారంభమైన అనంతరం శ్రీవారి ఆలయం ముందు, ఆ తరువాత అన్నమయ్య భవన్లో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో  వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజులు సిఫారసు లేఖలపై జారీ చేసే దర్శనాలు రద్దు చేశామన్నారు. అలాగే శ్రీవాణి టికెట్లు కూడా ఆఫ్ లైన్లో రద్దు చేసినట్లు ఆయన వివరించారు.