కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనేది ప్రతి హిందువు కోరిక. మన రాష్ట్రంలోనే ఉన్నా వ్యయ ప్రయాసలకోర్చి స్వామివారిని దర్శించుకోలేని పరిస్థితి వారిది. అలాంటి వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టిటిడి రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 గ్రామాల నుండి సుమారు 9300 మంది ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి ఆహ్వానించినట్టు సమరసత సేవ ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్ తెలిపారు.