ఏపీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా యలమంచిలి పర్యటన నిమిత్తం కొద్ది నిమిషాల క్రింత విజయవాడ విమానాశ్రయం నుంచి విశాఖ బయలు దేరారు. నిన్న మృతిచెందిన విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 12.00 గంటలకు యలమంచిలిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అడారి ఆనంద్ నివాసానికి చేరుకుంటారు. విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళర్పిస్తారు. అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.