ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు కాబోతున్నాయి. కామన్ సర్వీస్ సెంటర్ కింద ప్రభుత్వం 572 సేవలను సచివాలయాలు అందిస్తున్నాయి. తొలుత పైలట్ ప్రాజె క్టుగా కొన్ని సచివాలయాలకే ఇచ్చారు. ఇపుడు రాష్ట్రంలోని 14వేల5 సచివాలయాల్లో వీటిని అమలు చేయ నున్నారు. అంతేకాకుండా ప్రతీశాఖ ఉద్యోగికి కంప్యూటర్ ఇచ్చి, సదరు ఉద్యోగి ప్రభుత్వశాఖల కు చెందిన సేవలను, దృవీకరణ పత్రాలను వారితోనే చేయిస్తారు. ఇలాచేస్తే ప్రభుత్వ ఖజానాకు నిత్యం కాసులేనని Ens Live ఏడాది క్రితమే తెలియజేసింది. సీఎం సమీక్షలో ఈవిషయాన్ని అధికారులు(SOP)గా చెప్పారు.