హైదరాబాదులోని హుక్కా ప్రియులకు శుభవార్త. హుక్కా పార్లర్‌ను నడపడానికి తెలంగాణ హైకోర్టు షరతుల తో కూడిన అనుమతిని మంజూరు చేసింది. హుక్కా పార్లర్ యజమానులను వేధించవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో హుక్కా పార్లర్‌ను తనిఖీ చేసేందుకు లోపలికి రావద్దని సమర్థ అధికారు లను ఆదేశించలేమని కోర్టు పేర్కొంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక లాంజ్ హుక్కా & కేఫ్ చాంద్రాయణగుట్ట యజమాని దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు పట్ల హుక్కా ప్రియులు, హుక్కాపార్లర్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.