ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంగీకరించిన నేపథ్యంలో ఉద్యోగులకు ఏ విధంగా బదిలీలు నిర్వహించాలనే విషయమై సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు, ఇతర ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్లు తర్జన బర్జనలు పడుతున్నారు. తొలుత రెండేళ్ళు సర్వీసు పూర్తిచేసుకొని, రెగ్యులర్ అయిన వారికి బదిలీలు జరిపి, తరువాత మిగిలిన వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. అంతేకాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీల విషయంలో ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా నిబంధనలు పాటించాలా.. లేదంటే సచివాలయశాఖకు ప్రత్యేకంగా కొత్త నిబంధనలు ఏర్పాటు చేసి జీఓ ఇవ్వాలా అనేవిషయంపై కూడా సమాచాలోచనలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.