గీతం యూనివర్శిటీలోని మెడికల్ కాలేజీ ప్రాంతం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని, వాటిని కూల్చేం దుకు విశాఖపట్నం రెవిన్యూ యంత్రాంగం మరోసారి సిద్ధమైంది. తెల్లవారు జామునుండి కూల్చివేత మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రహరీ గోడలు తొలగిస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించి మరీ ప్రభుత్వం ఈకూల్చివేతకు పూనుకుంది. కాగా కనీసం సమాచారం లేకుండా, కక్షపూరీతంగా కూల్చుతున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తుంది. యూనివర్సిటీ ఆక్రమణలు 45 ఎకరాలు మేర ఉన్నాయని.. ప్రభుత్వ భూములు ఆక్రమణ భారీగా జరిగిందంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలో తొలగింపు జరుగుతోంది.