ఆంధ్రప్రదేశ్ విశాఖ(గాజువాక)లో ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ విజయ విశాఖ పాల డెయిరీ కంపెనీ లిమిటెడ్ అమ్మకానికి/విలీనానికి రంగం సిద్ధమైనట్టు స్పష్ట మైన సంకేతాలు కనిపిస్తున్నాయి. డెయిరీకి చెందిన డైరెక్టర్లతో ఇటీవలే ఒకప్రైవేటు కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ప్రధాన షేర్ హోల్డర్లు, కంపెనీ ఉద్యోగులతోనూ మంతనాలు చేసినట్టు తెలిసింది. ప్రతిపాదించిన ప్రైవేటు కంపెనీలో విశాఖ డెయిరీలో విలీనం చేసినా, అమ్మకం చేసినా భారీ నజరానా ఇస్తామని కూడా ఆశచూపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ అంశం వైరల్ అవుతుంది. విశాఖ డెయిరీ పాలు సేకరించే అన్ని ప్రాంతాల నుంచి ఒక ప్రైవేటు డెయిరీకి చెందిన ప్రతినిధులు గ్రామస్థాయిలోనూ, పాల సేకరణ కేంద్రాల సమాచారంతోపాటు మొత్తం విశాఖ డెయిరీకి వున్న పాల నెట్వర్క్ రైతులు, బల్క్ కూలింగ్ సెంటర్లు, గ్రామస్థాయిలో సచివాలయ పశుసంవర్ధకశాఖ సిబ్బంది, అధికారుల వివరాలు సేకరిస్తుండటం విశేషం..!