ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల ఆదాయానికి గండి కొట్టే పంచాయతీ, రెవిన్యూ సిబ్బందిపై ప్రభు త్వం మూడోకన్ను వేసి పర్యవేక్షణ చేపడుతున్నట్టు సమాచారం. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం గా 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఏడాది నుంచి రెవిన్యూ, ఇతర దృవీకరణ పత్రాలు సచివాలయాల్లోనే ఇవ్వడం ప్రారంభించింది. అయితే నాటి నుంచి నేటి వరకూ సచివాల యాలున్న వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా మీ-సేవ సర్వీలకు ఎక్కడా డిమాండ్ తగ్గకపోగా పెరుగుతంది. దీనితో ఇదంతా ఇంటి దొంగల పనేనని భావించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ సచివాలయ సేవలు, మీ-సేవల ద్వారా పొందిన సేవలను లెక్కగట్టింది. దీనితో చాలా చోట్ల సచివాలయాల కంటే మీ-సేవాల్లోనే రెవిన్యూశాఖ, పంచాయతీలకు పలు రకాల దృవీకరణలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఏఏ జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కాకుండా మీ-సేవల్లో ఎక్కడ, ఏ మండలం, డివిజన్ నుంచి అర్జీలు అధికంగా వెళుతున్నాయనే సమాచారాన్ని బయటకు తీసేపనికి తెరలేపింది ప్రభుత్వం. ఒక పక్క ప్రభుత్వా నికి ఆదాయంలేక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతుంటే..మరోపక్క సిబ్బందే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టించే వైనంపై సీరియస్ గా వుంది.
అదనపు ఆదాయం కోసమే మీ-సేవాలకు ఫైళ్ల బదిలీ
గ్రామ, వార్డు సచివాలయాల్లో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా 572 రకాల దృవీకరణలు తక్కువ ధరలకే ప్రభుత్వం అందిస్తోంది. అందునా..మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిర్ణీత సమయానికే వీటిని అందజేస్తుంది. ఈనేపథ్యంలో వివిధ శాఖల సిబ్బందికి అడ్డడారిలో వచ్చే ఆదాయం పడిపోతున్నది. దీనితో సచివాలయాలకు కాకుండా మీ-సేవ కేంద్రాలకు పలు రకాల దృవీకరణ పత్రాలను దారిమళ్లిస్తున్నారు. కొంత మంది మీ-సేవ ప్రతినిధులతో కుమ్మక్కై రేటు మాట్లాడుకుంటూ..అడిగిన మొత్తం రాగానే సదరు దృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు. అలా ఆదాయాలు పెంచుకోవడానికి తేడా సిబ్బందికి మీ-సేవాలు కేరాఫ్ అడ్రస్ గా మారాయని ప్రభుత్వం గుర్తించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న మీ-సేవా కేంద్రాల జాబితాతో పాటు. ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలోని మీ-సేవా కేంద్రాల్లో ప్రభుత్వ దృవీకరణ పత్రాలు అధికంగా చేస్తున్నారనే సంఖ్యను ప్రభుత్వం లెక్కలు వేస్తున్నది. అక్రమార్జన కోసం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిని గుర్తించే పనిని వేగవంతం చేసింది. ప్రభుత్వ రికార్డుల్లోనూ సచివాలయ సేవల కంటే..రాష్ట్రవ్యాప్తంగా మీసేవ రికార్డులే అధికంగా ఉండటం ప్రభుత్వ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
జిల్లాలో కలెక్టర్లు, మండలాల్లో తహశీల్దార్ లు అప్రమత్తం
ప్రభత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే వారిని గుర్తించే పనిని ప్రభుత్వం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో తహశీల్దార్లకు అప్పగించినట్టు సమాచారం అందుతుంది. ఎక్కువగా ఏఏ మీ-సేవా కేంద్రాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల కంటే అత్యధికంగా రెవిన్యూ, ఇతర ప్రభుత్వశాఖల ఆధారిత దృవీకరణలు చేపడుతున్నారో లెక్కగట్టే కార్యక్రమం చేపట్టినట్టు తెలిసింది. తద్వారా ఏఏ ప్రాంతాల్లో ఏఏ శాఖల సిబ్బంది సచివాలయాల్లో కాకుండా మీ-సేవ కేంద్రాల ద్వారా దృవీకరణలు చేయిస్తున్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం వుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండలాల డేష్ బోర్డుల నుంచి సమాచారాన్ని రాష్ట్ర అధికారులు సేకరించినట్టు చెబుతున్నారు. పక్కాగా ఆధారాలు లభించిన వెంటనే సదరు సిబ్బందిపై వేటు వేసి తద్వారా ఆదేశాలు జారీ చేయాలని చూస్తున్నట్టు పక్కగా సమాచారం అందింది.
ప్రధాన ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం
భారదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే అత్యధిక మొత్తంలో సంక్షేమ పథకాల పేరిట నగదు బదిలీ నేరుగా లబ్దిదారులకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజనాలో కాసులు ఐసుముక్క కరిగిపోయినట్టుగా ఆవిరైపోతున్నా యి. దీనితో ప్రభుత్వం నిత్యం ఆదాయం వచ్చే ప్రభుత్వశాఖలు, ఆదాయ మార్గాలను అన్వేషించడంతోపాటు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలకు ఎక్కడ గండి పడుతుందనే కోనంలో ప్రభుత్వంలోని 75 శాఖల్లోనూ నిఘా పెట్టింది. ప్రతీరోజూ సాయంత్రానికల్లా ప్రభుత్వ ఖజానాలోకి నిర్ణీత మొత్తం వస్తే తప్పా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పించన్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వ శాఖల్లోని అత్యంత వేగంగా ఆదాయం వచ్చే ప్రభుత్వ శాఖలను గుర్తించడంతోపాటు, ఆయా శాఖల్లో డిజిటల్ లావాదేవీలను ప్రవేశపెట్టాలని ఆయా ప్రభుత్వశాఖ ముఖ్యకార్యదర్శిలను కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విధంగా చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్నులు, ఇతర ఆదాయం ఎప్పటకప్పుడు ఖజానా డేష్ బోర్డు ద్వారా తెలుసుకునే వీలుంటుందని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. చూడాలి ఇంటి దొంగలను పట్టుకుంటుందా.. పోన్లే మన వాళ్లే కాస్త కాసులకు కక్కుర్తి పడుతున్నారని వదిలేస్తారో..!