ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో భర్తీచేయబోయే గ్రూప్-2 ఉద్యోగాలన్నీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 13 కొత్తజిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వశాఖల కార్యాలయాల్లోని సర్ధుబాటుకోసమేనని తెలుస్తుంది. ఇటీవల గ్రూప్-1 లో ఇచ్చిన పోస్టులు కూడా అత్యధికంగా కొత్త జిల్లాల్లో తక్కువగా డిఎస్పీలను
భర్తీచేయడానికి, ఇతర ప్రభుత్వ శాఖలకు సర్ధుబాటు చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇపుడు గ్రూప్-2 పోస్టులు కూడా ఆ విధంగా క్రిందిస్థాయి కేడర్ పోస్టులను భర్తీచేయడానికే ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. త్వరలోనే గ్రూప్-1 ప్రక్రియ మొత్తం పూర్తిచేయడానికి అన్ని ఏర్పాట్లు
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఎన్ని పోస్టులకు అనుమతిస్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 1500 గ్రూప్-2 పోస్టులు అవసరం అవుతాయని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది.
అందులోనూ 2024 తరువాత అత్యధికంగా ఉద్యోగ విరమణలు ఉండటం కూడా ప్రస్తుత నోటిఫికేషన్ కు ఊతం వచ్చింది. అయితే ప్రభుత్వం సుమారు 500 నుంచి 700 వరకూ పోస్టులకు అనుమతి ఇస్తుందని అధికారులు కూడా భావిస్తున్నారు. అంత మొత్తంలో పోస్టులు భర్తీచేయకపోతే పరిపాలన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కొన్నిప్రభుత్వశాఖల్లో పదోన్నతల ద్వారా కూడా గ్రూప్-2, గ్రూప్-1 పోస్టుల్లోకి చేరికలు ఉంటాయని తెలిసింది. అలా మొత్తం ఏర్పాట్లు పూర్తయిన తరువాతనే కొత్తగా తీస్తున్న పోస్టుల భర్తీ, ప్రభుత్వ శాఖల కేటాయింపు జరుగుతుందని సమాచారం. చూడాలి ప్రభుత్వం ఏ తరహా విధానం అవలంభిస్తుందనేది..!