ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేడా ఉద్యోగులు, సిబ్బంది విషయంలో దూకుడు పెంచింది. ఉదయం బయె మెట్రిక్ వేసే సమయానికి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి, ఏదో తెగ కష్టపడిపోతున్నట్టుగా అధికారిక వాట్సప్ గ్రూపుల్లో ఫోటోలు పెట్టేసి.. కార్యాలయంలోని సిబ్బంది పనిమొత్తం తానొక్కడినే చేసేస్తున్నట్టు తెగ ఫీలై పోయి.. ఆపై సొంతపనులపై వెళ్లి మళ్లీ సాయంత్రం సమయానికి అటెండెన్సులు వేసే తేడా సిబ్బంది ఆట కట్టించడానికి ప్రత్యేక సంచార ఆకస్మిక తనిఖీ బృందాలను(ఫ్లైయింగ్ చెకింగ్ స్క్వాడ్) ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు వారు పలువురు అధికారులతో స్క్వాడ్ బృందాలను కూడా నియమించింది. వీరంతా ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. తనిఖీ వచ్చిన సమయానికి కార్యాలయాల్లో సిబ్బందిలేకపోయి నా..మూమెంట్ లో సరైన కారణం లేకపోయిని జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్చార్జి పోస్టులు, డిప్యూటేషన్లు చేసేవారని ఈ బృందాలు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. చూడాలి ఈ ప్రత్యేక బృందాలను తేడా సిబ్బందిని ఎంత మేరక పట్టుకుంటాయో..కార్యాలయంలోనే ఉంచి పనులు చేయిస్తాయో..!