ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్


Ens Balu
144
Tadepalli
2023-01-10 05:02:23

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని కలెక్టర్లు విధినిర్వహణలో ఉండి మృతిచెందిన వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాల ఇచ్చే కార్యక్రమం వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా వారి విద్యార్హతలను బట్టి గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేసి న తరువాత మిగులు ఖాళీలను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీచేసేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేపడుతోంది. ఇందులో భాగంగా జనవరి నెలాఖరులోగా కారుణ్య నియామకాలను పూర్తిస్థాయిలో భర్తీచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనితో అన్ని జిల్లాల్లో కారుణ్యనియామకాలన్నీ చాలా వరకూ సచివాలయశాఖలోనే భర్తీచేస్తున్నారు.

సంక్రాంతి నాటికి కొత్త నోటిఫికేషన్ల క్లారిటీ..?
కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేసిన తరువాత మిగులు ఉద్యోగాలకు సంబంధించిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ పై ప్రభుత్వం ప్రకటన చేయాలని యోచిస్తున్నట్టు రాష్ట్ర స్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కు చెప్పారు. ఇప్పటికే చాలా వరకూ ఉద్యోగాలను గ్రామ, వార్డు సచివాల యశాఖలోనే ప్రభుత్వం భర్తీ చేస్తుందని, మిగిలిన ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్ తోపాటు, సదరు ఉద్యోగాలకు గతంలో విద్యార్హతలు లేకపోవడం వలన మిగిలిపోయిన ఉద్యోగాలను అర్హతల విషయంలోనూ సడలింపులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే దానిపై పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి వుందన్నారు. 2023 ఏప్రిల్ నాటికి సచివాలయశాఖలో పోస్టులన్నీ భర్తీచేసి పూర్తిస్థాయి ప్రభుత్వశాఖగా నిలపాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నది ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మిగులు ఉద్యోగాలు, సచివాలయాల వారీగా ఖాళీలు వివరాలు సేకరించామన్నారు.

ఏప్రిల్ నెలలోనే బదిలీలపై ప్రకటన వచ్చే అవకాశం
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగాలన్నీ భర్తీచేసిన తరువాతన ప్రభుత్వం ఈ శాఖలో బదిలీలు చేసే ప్రక్రియ ప్రారంభించనుందట. ముందుగా ఖాళీలు భర్తీచేయడం ద్వారా మిగులు ఉద్యోగాలు నియామకాలు పూర్తిచేసి, అపుడు బదిలీలకు పచ్చజెండా ఊపను న్నారని చెబుతున్నారు. ఇప్పటికే విధుల్లోకి చేరి, రెండేళ్లు పూర్తి చేసుకున్నవారి జాబితాను ప్రభుత్వం సిద్దం చేసింది. తరువాత బ్యాచ్ లో సర్వీసు రెగ్యులైజేషన్ కు రెడిగా వున్నవారిని, కొత్తగా నియమాకాలుచేప ట్టే  ఖాళీలలను బేరీజు వేసుకొని, ఆపై బదిలీల ప్రక్రియ చేపట్టడం ద్వారా ఎక్కడా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈవిషయమై గ్రామ,వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని ప్రభుత్వ శాఖ  కార్యదర్శిలకు ఆదేశాలు వచ్చాయని సమాచారం. అన్నీ అనుకూలిస్తే  ఉద్యోగ నోటిఫికేషన్ తోపాటుగానే సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంపై ఒక క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది.