పోరుబాటకై ఐక్యవేదికగా ఉద్యోగుల సమర శంఖారావం


Ens Balu
111
Tadepalli
2023-01-11 01:48:09

ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల మరో పోరుబాటకు సిద్దమవుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్లూ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధనకు మరోసారి కదం తొక్కనున్నారు. నెలంతా కష్టం.. అయినా ఒటకవ తేదీకి రాని జీతం, పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఎరియర్లు, జీపిఎఫ్ బిల్లులు, ఎస్ఎల్ఎస్ బిల్లులు, ఇలా అనేక సమస్యలపై ఉద్యోగులంతా ఐక్య వేదికగా ముందుకు సాగడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర్య భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ చవిచూడని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కిందిస్థాయి సిబ్బందిపై పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ విరమణ చేసిన తరువాత రావాల్సిన ఉపయోగాలు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో సమరం ఒక్కటేనని ఉద్యోగులంతా భావిస్తున్నారు. దానికోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, కాంట్రాక్టు, పెన్షనర్ సంఘాలన్నీ ఏకమై ఐక్యవేదికగా పోరాటచేయాలని భావిస్తున్నాయి. దానికోసం రాష్ట్ర, జిల్లా, మండలాలు వారీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులు సిద్దపడుతున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంగా ఏర్పాటైన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని తీరా దానికి వ్యతిరేకంగా జీపీఎస్ ను తీసురావాలని చూస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగుల నిరసన తెలియజేయాలంటే అన్ని ఉద్యోగ సంఘాలు ఏకం కావాల్సిన సమయం ఆశన్న మైందని భావిస్తున్నారు. దానికోసం సుమారు 100 సంఘాలను ఒక వేదికపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తేతప్పా ఈఏడాది 7వ నెలలో అమలు కావాల్సిన పీఆర్సీ కూడా వచ్చే పరిస్థితి ఉండదని కూడా 75 ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లో కూడా చైతన్యం తీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులను సైతం ఆలోచింప జేసే విధంగా.. పీఆర్సీలో జరిగిన అన్యాయం కోల్పోయిన ఐఆర్, ఆలస్యంగా ఉద్యోగాలు రెగ్యులర్ చేయడం వలన కల్పోయిన రెండు డీఏలు, తగ్గిపోయిన హెచ్ఆర్ఏ, డీఏ ఇలా ప్రతీ సచివాలయ ఉద్యోగి తన సర్వీసులో ఏం కోల్పోయారో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు అన్నీ కలిపి ఏకతాటిపైకి రాకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగమే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం వుంటుందనే విషయాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో సామాజిక మాద్యమాల ద్వారా తీసుకెళుతున్నారు. ఉద్యోగులపై ప్రభుత్వం అదనపు భారం, 2వ శని, ఆది వారాల్లో అదనపు విధులు, ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం తదితర అంశాలను కూడా ప్రతీ ఉద్యోగి పరిగణలోనికి తీసుకోకపోతే భవిష్యత్తు మరింత దారుణంగా తయారవుతుందని పలు ఉద్యోగ సంఘాల నేతలు సహచర ఉద్యోగులకు తెలిసేలా చెబుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఔటు సోర్సింగ్ ఉద్యోగులతో పనులు చేయించే ప్రభుత్వం అదనంగా చేసిన పనికోసం ఏమీ మాట్లాడకపోవడం, సర్వీసులను రెగ్యులర్ చేయకపోవడం వంటి విషయాలను కూడా ఈ ప్రత్యేక ఆందోళన వేదికపైకి తీసుకు వస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ లను ఒప్పుకోకపోతే మాస్ లీవ్(మూకుమ్మడి సెలవులు) పెట్టే యోచనలో కూడా ఉన్నట్టు సమాచారం అందుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ప్రభుత్వ ఉద్యోగుల తలపెట్టిన ఈ సమర శంఖారావంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఉద్యోగులకు నెలయ్యేసరికి జీతాలు అందని ప్రశ్నలా తయారైంది..చూడాలి ఏం జరగబోతుందనేది..!