తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి , ఆతరువాత మీడియాతో మాట్లాడారు. ఆటోమేటిక్ మిషన్ల ద్వారా రోజుకు 6 లక్షల దాకా లడ్డూల తయారీకి అవకాశం వుంటుందన్నారు.